తెలంగాణ

వాట్సప్ ద్వారా టిక్కెట్లకు దరఖాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: రానున్న స్థానిక సంస్థల్లో వాట్సప్ నెంబర్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రజలను కోరారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ టిక్కెట్ల కోసం వాట్సప్ నెంబర్ 9701730033 నంబర్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారరు. ఈ దరఖాస్తులను కోర్ కమిటీకి పంపిస్తామన్నారు. కోర్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి తుది నివేదికను రాష్ట్ర పార్టీకి అందచేస్తుందన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ సొంత బలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, దేశంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీగా అవతరిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ అప్రజాస్వామిక విధానాలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. అకాల వర్షంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, డీకే అరుణ, విజయరామారావు, చింతాసాంబమూర్తి పాల్గొన్నారు.

ఆందోళన కలిగిస్తున్న ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు

* అనుభవంలేని ఏజెన్సీకి ఇవ్వడం వల్లనే ఈ పాట్లు
* ఏజన్సీపై చర్యలు తీసుకోవాలి
* బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఇంటర్ ఫలితాలు అనంతరం రాష్ట్రంలో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఆందోళన కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడరాదని ఆయన కోరారు. ఎలాంటి అనుభవం లేని ఒక ఏజన్సీకి సాంకేతిక నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పడం వల్ల అనేక సమస్యలు వచ్చినట్లు అర్థమవుతోందన్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని గతంలోనే బీజేపీ హెచ్చరించిందన్నారు. కాని రాష్ట్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు. దాదాపు తొమ్మిది లక్షలకుపైగా విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఫలితాలను ప్రకటించడంలో జవాబుదారీలేకుండా వ్యవహరించిన ఏజన్సీపైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమండ్ చేశారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భూరికార్డుల విషయంలో కేంద్రం నిధులు మంజూరు చేసినా రాష్ట్రప్రభుత్వం ఆదరాబాదరాగా పాస్ బుక్‌లను అందించి అనేక తప్పిదాలకు ఆస్కారం కల్పించిందన్నారు. దేశంలోనే త్వరితగతిన భూరికార్డులను ప్రక్షాళన చేశామని ప్రభుత్వం గొప్పలకు పోతోందన్నారు. భూరికార్డులు అస్తవ్యస్తమైన రైతులను తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయన్నారు. బీజేపీ సూచనలను పెడచెవిన పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు రెవెన్యూ శాఖపై నెపం పెట్టి తమ తప్పులేనట్లు ప్రవర్తిస్తోందన్నారు.