తెలంగాణ

మే 16 నుండి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 16వ తేదీ నుండి నిర్వహించనున్నట్టు బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. మే 16 నుండే ఫస్టియర్ పరీక్షలు, సెకండియర్ పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9 నుండి 12 వరకూ ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకూ సెకండియర్ పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు.
ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుండి 31 వ తేదీ వరకూ జరుగుతాయని, ఎథిక్స్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 1న నిర్వహిస్తామని, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్ జూన్ 3న జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10 నుండి ఒంటిగంట వరకూ జరుగుతాయని పేర్కొన్నారు.
పరీక్షల టైమ్ టేబుల్
మొదటి సంవత్సరం మాథ్స్ 1ఎ , బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ -1 సైకాలజీ పేపర్-1లు మే 16న జరుగుతాయని, అదే రోజు సాయంత్రం సెకండియర్ మాథ్స్ 2ఎ, బోటనీ -2, సివిక్స్-2, సైకాలజీ -2 పరీక్ష జరుగుతుంది. 17వ తేదీన ఉదయం మాథ్స్1బీ, జువాలజీ -1, హిస్టరీ -1 జరుగుతాయి. సాయంత్రం సెకండియర్ పరీక్షలు మాథ్స్ 2బీ, జువాలజీ -2, హిస్టరీ -2 జరుగుతాయి. 18వ తేదీన ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, క్లాసికల్ లాంగ్వేజి పేపర్-1, సాయంత్రం సెకండియర్ ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, క్లాసికల్ లాంగ్వేజి పేపర్-2 జరుగుతాయి. 20వ తేదీన కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్‌ఆర్ట్సు, మ్యూజిక్ పేపర్-1 జరుగుతాయి. అదే రోజు సాయంతత్రం కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ -2, మ్యూజిక్ -2 జరుగుతాయి. 21వ తేదీన ఉదయం సెకండ్ లాంగ్వేజి పేపర్ జరుగుతుంది. సాయంత్రం సెకండియర్ సెకండ్ లాంగ్వేజి పేపర్ జరుగుతుంది. 22న ఉదయం ఇంగ్లీషు-1, సాయంత్రం ఇంగ్లీషు పేపర్-2 జరుగుతాయి. మే 25న జియాలజీ, హోంసైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జికోర్సు పేపర్లు ఉదయం ఫస్టియర్‌కు, సాయంత్రం సెకండియర్‌కు జరుగుతాయి. 27న ఉదయం ఫస్టియర్‌కు మోడరల్ లాంగ్వేజి పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1 జరుగుతాయి. సాయంత్రం అవే సబ్జెక్టులు సెకండియర్‌కు జరుగుతాయి.
స్పాట్ కేంద్రాల్లో టీచర్ల నిరసనలు
సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌టీయూ నేతృత్వంలో ఉపాధ్యాయులు శుక్రవారం నాడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎస్‌టీయూ నేతలు బీ భుజంగరావు, ఆర్ శ్రీనివాసరెడ్డి, కరుణాకర్, జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, బీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో 20వ తేదీన స్పాట్ వాల్యూయేషన్ జరుగుతున్న సెయింట్స్ ఆన్స్ స్కూల్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సంఘం నేతలు డీ సంజీవరావు, ఎం రవీందర్, ఎస్ మల్లయ్య తెలిపారు.