తెలంగాణ

అత్యున్నత ప్రమాణాలతో గురుకులాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: రాష్ట్రంలో గురుకులాలను అత్యున్నత విద్యా ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నట్టు సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సచివాలయంలో సోమవారం నాడు ఆయన లాంఛనంగా వేసవి శిబిరం- సమురాయ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు సమానంగా రాష్ట్రంలో అన్ని గురుకులాలను తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. దేశంలో అతి పెద్ద వేసవి శిబిరాన్ని గురుకుల పాఠశాలలు సంయుక్తంగా నిర్వహించడం ముదావహమని చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు.
సాంఘిక సంక్షేమ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ వేసవి శిబిరంలో 50వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని చెప్పారు. 61 థీమ్స్‌తో దీనిని నిర్వహిస్తున్నామని అన్నారు.
గుర్రపుస్వారి, లలిత సంగీతం, మార్షల్ ఆర్ట్సు, ద్రోన్‌ల తయారీ, స్విమ్మింగ్, స్టాక్ మార్కెట్, ఆర్గానిక్ ఫార్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, యంగ్ లీడర్స్ కార్యక్రమం, జూడో, వెస్ట్రన్ డాన్స్, ఫిల్మ్ మేకింగ్, సెయిలింగ్, ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ , పబ్లిక్ స్పీకింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఫోటోగ్రఫీ, అథ్లెటిక్స్, వెస్ట్రన్ మ్యూజిక్, క్రాఫ్ట్ తదితర ప్రత్యేక రంగాల్లో ఈ శిక్షణ అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అజయ్‌మిశ్రా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి మహేష్ దత్ ఎక్కా, ఎస్‌సీడీడీ డైరెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.