తెలంగాణ

అలహాబాద్ న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టుకు బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న గండికోట శ్రీదేవిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. ఈ మేరకు కొలీజియం సభ్యులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డీ, జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ నిర్ణయం తీసుకున్నారు.కొలీజియం ఆదేశాల మేరకు జస్టిస్ గండికోట శ్రీదేవి త్వరలో తెలంగాణ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు.
సిటీ సివిల్ కోర్టుల ఆరో అదనపు జడ్జి ఆర్ డానీ రుథ్ వికారాబాద్ సీనియర్ సివిల్ జడ్జీగా బదిలీ అయ్యారు. చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పి ముక్తిదను కరీంనగర్ జగిత్యాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. 13వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బీ శ్రీదేవిని నల్గొండ , మిర్యాలగూడ జిల్లా సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బోకరాజు శ్రీనిసరావును నల్గొండ జిల్లా సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. హైదరాబాద్ రెండో అదనపు జడ్జి డీ కిరణ్‌కుమార్‌ను 19వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌గా బదిలీ చేశారు. 19వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాధా కృష్ణ చవాన్‌ను ఐటీ అదనపు జడ్జిగా నియమించారు. ఎల్బీనగర్ ఏడో అదనపు సీనియర్ సివిల్ జడ్జి బీ పుష్పలతను నిజామాబాద్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. వికారాబాద్ సీనియర్ సివిల్ జడ్జి జీ ప్రేమలతను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఏడో అదనపు జడ్జిగా నియమించారు. హైదరాబాద్ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మహ్మద్ అఫ్రాజ్ అక్తర్‌ను ఖమ్మం జిల్లా సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. జగిత్యాల -కరీంనగర్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కే పద్మావతిని హైదరాబాద్ 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌గా బదిలీ చేశారు. 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పీ అన్నిరోజ్ క్రిన్టియన్ హైదరాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి కే మారుతి దేవిని ఎల్బీనగర్ ఏడో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. మిర్యాలగూడ సీనియర్ సివిల్ జడ్జి బీ అపర్ణదేవిని 13వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌గా బదిలీ చేశారు. హుజూర్‌నగర్ సీనియర్ సివిల్ జడ్జి కే జయంతిని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌గా బదిలీ చేశారు. నిజామాబాద్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్ రోజారమణిని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.