తెలంగాణ

ఏడుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా, ఉపాధ్యాయ నియోజకవర్గాల కోటా నుంచి ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. జూబ్లీహాల్‌లోని శాసనమండలి చైర్మన్ కార్యాలయంలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన హోంమంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశం ప్రమాణ స్వీకారం చేయగా, ఎంఐఎం నుంచి ఎన్నికైన రియాజ్ ఉల్ హసన్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నర్సిరెడ్డి, రఘోత్తమరెడ్డి ఉన్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సిహెచ్ మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు.