తెలంగాణ

యాదాద్రీశునికి వైభవంగా లక్ష పుష్పార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 15: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం శివకేశవుల ఆరాధనలు, అభిషేకాలు, ఆర్జిత సేవలు శాస్తయ్రుక్తంగా సాగాయి. లక్ష్మీనరసింహుల ఆలయంలో వేకువ జామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి హారతి నివేదన చేశారు. బిందె తీర్థం, బాలభోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా స్వయంభూవులను ఆరాధించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో కొలిచారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో, పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించి అర్చించారు. కవచమూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావచనం, శ్రీ సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవోత్సవాలు నిర్వహించారు. అలాగే ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష్మీ నరసింహుడికి లక్ష పుష్పార్చణ నిర్వహించారు. బాలాలయంలో ఉదయ నుండి సాయత్రం వరకు కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వెండిజోడి సేవోత్సవం నిర్వహించారు.
ముక్కంటికి రుద్రాభిషేకం
యాదాద్రి శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ఉప శివాలయంలో సోమవారం పురస్కరించుకుని రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు, మహాన్యాసక పూర్వ రుద్రాభిషేకం, బిల్వార్చన, పార్వతి రామలింగేశ్వరుల కల్యాణం శాస్తయ్రుక్తంగా సాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్వామివారికి మహాలక్ష్మి హారం బహూకరణ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి 11లక్షల రూపాయల విలువైన మహాలక్ష్మి హారాన్ని హైద్రాబాద్‌కు చెందిన అడుసుమల్లి వెంకటరత్నం కుటుంబ సభ్యులు గురునాథ్‌ప్రసాద్, శ్రీనివాసరావు, రతన్‌సాయిలు బహూకరించారు. ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులకు వారు హారాన్ని అందచేశారు.