తెలంగాణ

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, మార్చి 25: ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని, రాబోయే రోజులలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ పార్టీయే ప్రత్యామ్నాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ సీనియర్ నాయకులు బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత శాసనసభ ఎన్నికలలో బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉన్నప్పటికి, సరైన వనరులు లేకపోవడంతో వెనకడుగు వేయాల్సి వచ్చిందన్నారు. బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం ఒకటని, ఇక్కడ ఈసారి బీజేపీ జెండాను ఎగరవేయగలమనే ధీమాను వ్యక్తం చేశారు. గణంకాలు చూడవద్దని, రాజకీయాలలో గణంకాలు ముఖ్యంకాదని, కెమిస్ట్రీ ముఖ్యమని, ప్రజల హృదయాలలో నిలిస్తే సునాయసంగా వారే గెలిపిస్తారని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కారుకు పోతున్నారనే అభిప్రాయం ప్రజలలో నెలకొన్నందున రాబోయే రోజులలో ప్రజలు బీజేపీని ఆదరించడం ఖాయమన్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఎదురు నిలబడే శక్తి బీజేపీకే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితినెలకొన్నందున బీజేపీకి మంచిరోజులు రాబోతున్నాయని, కార్యకర్తలు ఎవ్వరు కూడా ఆధైర్యపడవద్దన్నారు. 16 మంది ఎంపీలు గెలిస్తే కేంద్రంలో ఏవిధంగా చక్రం తిప్పుతాడో అర్థం కావడంలేదని, ప్రతిపక్షంలో ప్రధాని కుర్చీ కోసం 15 మంది పోటీ పడుతున్నారని, వీరితో సుస్థిరమైన ప్రభుత్వం ఏవిధంగా వస్తుందని ప్రశ్నించారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం నరేంద్రమోదీతోనే సాధ్యమవుతుందన్నారు. కాశ్మీరు నుంచి కన్యకుమారి వరకు, అరుణాచల్‌ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు మన్ననలను పొందిన ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. కుటుంబ పాలనకు, అవినీతికి ఆస్కారంలేని పాలన బీజేపీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీతో సహా అన్నీ రాజకీయ పార్టీలలో కుటుంబ రాజకీయం కొనసాగుతుందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి బంగారు శృతి మాట్లాడుతూ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తనకు అభివృద్ధి ఏవిధంగా చేయాలో తెలసని, ఒకసారి అవకాశం ఇస్తే నాగర్‌కర్నూల్ నియోజకవర్గంను దేశంలోనే గుర్తింపువచ్చేలా చేస్తానని అన్నారు. మహిళకు బిజేపీ అవకాశం ఇచ్చినందున ప్రజలు ఆదరించాలన్నారు. రైల్వేలైన్, జాతీయ రహదారి, మెడికల్ కళాశాల, వృత్తివిద్య కళాశాలను ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. బీజేపీ నాయకులు సుబ్బారెడ్డి, అయ్యంగార్ ప్రభాకర్‌రెడ్డి, దిలీపాచారి, సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..నాగర్‌కర్నూల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు