తెలంగాణ

హరీషన్న కరివేపాకయ్యాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మార్చి 25: ‘హరీషన్నా.. అప్పుడు నీవు లేకపోతే టీఆర్‌ఎస్ లేదు, సింగూర్ నుండి సిద్దిపేట వరకు పాదయాత్ర చేశావు, ప్రస్తుతం రెండోసారి శాసనసభ ఎన్నికలు ముగిసి మంత్రివర్గం ఏర్పడిన తరువాత ఇప్పుడు కరివేపాకయ్యావు’ అని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బాధను వ్యక్తం చేశారు. సోమవారం నామినేషన్ వేసిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర నిధులు గ్రామపంచాయతీలకు నేరుగా ఢిల్లీ నుండి సర్పంచ్ ఖాతాల్లో పడుతుందన్నారు. అప్పుడు దళారులు, బ్రోకర్ల వ్యవస్థ ఉండదని తెలిపారు. మూతపడిన ఎన్‌డీఎస్‌ఎల్ తెరవాలన్నదే లక్ష్యం. ఆరు లైన్ల జాతీయ రహదారులు పూర్తి అవుతాయని తెలిపారు. మెదక్ వెనుకబడిన జిల్లా పూర్తి అభివృద్ది జరగాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. మోదీ నాయకత్వాన్ని బలపర్చండి, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఢిల్లీ చరిత్రను వివరించండి, తనకు ఓటు వేసి బలపర్చాలని, మీ ఆశీస్సులు తనపై ఉంటే ఢిల్లీ పార్లమెంట్‌లో సభ్యునిగా ఉండి మెదక్ పార్లమెంట్‌ను అభివృద్ధి చేస్తానని రఘునందన్‌రావు ప్రకటించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం టైగర్ నరేంద్రను గెలిపించిన చరిత్ర ఉంది. ఎమ్మెల్యే వాసుదేవరెడ్డిని గెలిపించిన చరిత్ర ఉంది.
కార్యకర్తలందరు సైనికులుగా పనిచేసి ఈ యుద్ధంలో మోదీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీ ఆత్మీయ కుటుంభమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సంఘటన మంత్రి శ్రీనివాస్, రాజేశ్వర్‌రావు, దేశ్‌పాండే, ఆకుల రాజయ్య, గోపన్న తదితరులు పాల్గొన్నారు.