తెలంగాణ

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, మార్చి 25: కేంద్రంలో మే 23వ తేదీ తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసునని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మేనిఫెస్టో కమిటీ సభ్యుడు రాంమాధవ్ అన్నారు. అవినీతి రహిత పాలన, సుస్థిర, కుంభకోణాలు లేని పాలన అందిస్తున్న మోదీకి దేశ ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారని ఆయన చెప్పారు. సోమవారం రాత్రి ఆర్మూర్‌లో కమల విజయభేరి పేరిట జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పసుపు, ఎర్రజొన్న, చెరుకు రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, దీంతో పాటు ఇతర పంటలకు మార్కెట్ ధర ఇప్పిస్తామని అన్నారు. ఇందుకోసం ప్రైస్ డెఫిషియెన్సీ పేయ్‌మెంట్ సిస్టం ద్వారా పంటలకు ధర చెల్లిస్తామని, ఈ విషయాలన్నింటిని బీజేపీ మేనిఫేస్టోలో పెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్లో ఆశించిన ధర లభించకుంటే విక్రయించిన పంటలకు నష్టం వాటిల్లకుండా నేరుగా అదనపు బోనస్‌ను రైతు ఖాతాలో వేస్తామని, రాబోయే మోదీ ప్రభుత్వంలో అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఎర్రజొన్నలకు మద్దతు ధర, చెరుకు రైతులను ఆదుకోవడం లాంటి చర్యలు చేపడుతున్నామని అన్నారు.
ఫ్రంట్లు, టెంట్లు మోదీని ఏమీ చేయలేవు
ఫెడరల్ ఫ్రంట్లు, టెంట్లు నరేంద్ర మోదీని ఏం చేయలేవని రాంమాధవ్ అన్నారు. కేసీఆర్ హైదరాబాద్‌లో, చంద్రబాబు విజయవాడలో, మమతబెనర్జీలో బెంగాల్‌లో, మాయావతి లక్నోలో, కేజ్రీవాల్ ఢిల్లీలో కూర్చొని రాబోయే ఎన్నికల్లో మోదీని గద్దె దించుతామంటూ కలలు కంటున్నారని అన్నారు.