తెలంగాణ

దేశం యువ నాయకత్వం కోరుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మార్చి 25: యావత్ భారతదేశం మోదీ ప్రభుత్వం వద్దని ఘోషిస్తున్నప్పటికీ కేసీఆర్ దొర ఒక్కరే మోదీకి మద్దతు ఇస్తున్నట్లు మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి తెలంగాణ ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలి కాళ్లమీద పడలేదా? అని నిలదీశారు. ఇప్పుడేమో కేసీఆర్ మాట మార్చారన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన మెదక్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సింహగర్జన సభలో ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. తాను ప్రేమించిన మెదక్‌కు ఐదేళ్ల తరువాత వచ్చానని విజయశాంతి తెలిపారు. 2014లో మెదక్‌కు మంచి జరుగుతుందని ఎమ్మెల్యేగా పోటీ చేశానని, అప్పుడు కుట్రలు, కుతంత్రాలతో తనను ఓడించారని, అయనా బాధపడలేదని తెలిపారు. ఒక మహిళగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని వెళ్లడానికి నడుం బిగించానని చెప్పారు. ఈ రాములమ్మ సినిమాలోనే కాకుండా రాజకీయంగా కూడా గెలుపు ఓటములు చూసిందని ఆమె తెలిపారు. కేసీఆర్ పాలన మోసపూరితమైందని ఆమె ఆరోపించారు. సోనియాగాంధీ దయతోనే కేసీఆర్ సీఎం అయ్యారని తెలిపారు. సిరిసిల్లాలో తాను ప్రచారం చేయకపోతే కేటీఆర్ గెలిచేవాడా అని ప్రశ్నించారు. వెళ్లిపోయిన ఎమ్మెల్యే గురించి బాధపడం లేదు, కానీ వారి స్థానంలో నూతన యువకులు ఎమ్మెల్యేగా రాబోతున్నారని తెలిపారు. రాజకీయంలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో, కేంద్రంలో కొత్త కాంగ్రెస్ పార్టీ రాబోతుందన్నారు. 10 నెలల్లో రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని ఆమె జోస్యం చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త నాయకత్వం రాబోతుందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఓటు ఎందుకు వేస్తారు తన ప్రాంత అభివృద్దిని ఆశించి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ప్రజలు గెలిపిస్తే చేసింది ఏమని మెదక్ ఎమ్మెల్యే, ఎంపీని ప్రశ్నించారు. 2009లో తాను ఎంపీగా గెలిపించారని, అప్పుడు మెదక్ పట్టణానికి రైల్వేలైన్ తేవడానికి ముగ్గురు రైల్వే మంత్రులు మారారు. ముగ్గురు జీఎంలు మారారు, అయినా 17 కిలోమీటర్ల రైల్వేమార్గాన్ని మంజూరు చేయించి అందుకు ఒక కోటి రుపాయలు తన అభివృద్ది నిధుల నుండి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50 శాతం వాటాతో మంజూరైనట్లు తెలిపారు. కేసీఆర్ 16 సీట్లు గెలుచుకుంటే ప్రధాని అవుతారని ప్రచారం చేసుకుంటున్న విషయాన్ని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలను బ్రహ్మానందం కామెడిగా అమె అభివర్ణించారు.కేసీఆర్ ఏ రకంగా ప్రధాని అవుతారో చెబుతారా? అని ఆమె నిలదీశారు. డబుల్ బెడ్‌రూమ్‌లు ఇస్తామన్నారు, దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైనవని ప్రశ్నించారు. ఎంఐఎంతో కలిసి 16 పార్లమెంట్ సీట్లలో కూర్చొని ఎప్పుడైనా సమస్యల పట్ల ఉద్యమం చేశారా ? అన్నారు. కొత్తగా రాష్ట్రంలో మాయ మాటలు చెప్పవద్దని, ప్రజలు ఎప్పుడో గుర్తించారని ఆమె తెలిపారు. ఈ నాటకం అంతా మోదీ కోసం చేస్తున్న నాటకం అని ఆమె తెలిపారు. కేసీఆర్ నట్టింట్లో మోదీ ఉన్నారని ఆమె ఆరోపించారు. ఢిల్లీలో మోదీకి గులాంగిరి చేస్తూ కేసీఆర్ సలాం చేస్తున్నారని ఆమె తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో మైనార్టీ సోదరులు మేల్కొనాలన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించుకోండి, మెదక్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న గాలి అనిల్‌కుమార్‌కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

చిత్రం.. కాంగ్రెస్ సింహగర్జన సభలో ప్రసంగిస్తున్న మాజీ ఎంపీ విజయశాంతి