తెలంగాణ

కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 18: తెలంగాణ సాయుధ పోరాటల అడ్డ పోరుగడ్డ నల్లగొండ జిల్లాలో నల్లగొండ పార్లమెంట్ స్థానం జాతీయ స్థాయిలో తనకంటు ప్రత్యేక గుర్తింపు సాధించింది. 1952నుండి 2014వరకు 17పర్యాయాలు సాగిన ఎన్నికల సమరంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చెరో ఏడు పర్యాయాలు గెలుపొంది సమవుజ్జీలుగా నిలిచాయి. ఈ నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు దిగ్గజాలు తెలంగాణ సాయుధ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, బొమ్మగాని థర్మభిక్షంలతో పాటు సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డిలు చెరో రెండు పర్యాయాలు పార్లమెంట్‌కు ఎన్నికవ్వడం విశేషం. 1952లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన రావినారాయణరెడ్డి 2లక్షల 72,280ఓట్లతో గెలుపొందగా, ఆనాటి దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు కంటే కూడా రావికి మెజార్టీ ఎక్కువ రావడంతో భారత పార్లమెంట్ భవనంలోకి తొలి అడుగుపెట్టి ప్రారంభోత్సవం చేసిన చారిత్రాక అవకాశం ఆయనకు దక్కింది. ఈ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అత్యధికంగా మూడుసార్లు నెగ్గిన రికార్డును సొంతం చేసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మార్క్సిస్టు నేత భీంరెడ్డి నరసింహారెడ్డి ప్రస్తుత భువనగిరి పేరిట ఉన్న రద్దయిన మిర్యాలగూడ పార్లమెంట్ స్థానంలో మూడుసార్లు నెగ్గడం గమనార్హం. చైతన్యానికి మారుపేరుగా పేరుమోసిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పాటు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ప్రజాసమితిని, టీడీపీ పార్టీలను సైతం గెలిపించిన తమ రాజకీయ చైతన్యాన్ని చాటుకున్నారు. బీజేపీ రెండుపర్యాయాలు రెండో స్థానంలో నిలిచాన విజయం అందుకోలేపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పిదప మారిన రాజకీయ వాతావరణం నేపధ్యలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా టీఆర్‌ఎస్ బలపడగా రానున్న ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా మారిన వైనం రాజకీయ పరిణామాల క్రమం ఓటర్ల ఆలోఛన ధోరణి మార్పుకు నిదర్శనంగా కనిపిస్తుంది.
సమవుజ్జీల సమర వేదిక.. నల్లగొండ
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి 1952ద్విసభ నియోజకవర్గంగా కొనసాగిన సందర్భంగా జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ నుండి కమ్యూనిస్టు పార్టీ దిగ్గజం రావి నారాయణరెడ్డి ఏకంగా నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు కంటే అధిక మెజార్టీతో 2లక్షల 72,280ఓట్లతో కాంగ్రెస్ ప్రత్యర్ధి వి.బి.రావుపై గెలుపొంది సంచలనం సృష్టించారు. రావితో పాటు పీఎడిఎఫ్ మరో అభ్యర్ధి ఎస్.అచ్చాలు కాంగ్రెస్ ప్రత్యర్థి పి.మహేంద్రనాథ్‌పై 1లక్ష 85,280ఓట్లతో గెలుపొందారు. 1957లో జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్ధి డి.వెంకటేశ్వర్‌రావు కాంగ్రెస్ అభ్యర్థి జి.ఎస్.రెడ్డిపై 53,515ఓట్లతో గెలుపొందగా, మరో అభ్యర్ధిగా కాంగ్రెస్‌కు చెందిన డి.రాజయ్య పీడీఎఫ్‌కు చెందిన ఎస్.అచ్చాలు 39,788ఓట్లతో గెలుపొందారు. డి.రాజయ్య ఆకస్మిక మృతితో 1960లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుండి వడ్డెపల్లి కాశీరామ్ తన ప్రత్యర్థి ఇండిపెండెంట్ పెద్దయ్యపై నెగ్గారు. 1962లో రెండోసారి రావి నారాయణరెడ్డి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి 33,396ఓట్లతో కాంగ్రెస్ ప్రత్యర్థి కె.పి.వి.రావుపై గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.వై.సలీం 92,278ఓట్లతో సీపీఐ ప్రత్యర్థి బొమ్మగాని ధర్మభిక్షంపై గెలిచారు. 1971లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా కె.రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వి.ఎన్.రెడ్డిపై 5,398ఓట్లతో గెలిచారు. 1977లో కాంగెస్ నుండి మహ్మద్ అబ్ధుల్ లతీఫ్ 1లక్ష 7,034ఓట్లతో బిఎల్‌డి అభ్యర్థి ఎం.జగన్మోహన్‌రెడ్డిపై గెలిచారు. 1980లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా టి.దామోదర్‌రెడ్డి సీపీఐ ప్రత్యర్థి బి.్ధర్మభిక్షంపై 53,669ఓట్లతో నెగ్గారు. 1984లో టీడీపీ పార్టీ నుండి ఎం.రఘుమారెడ్డి 1,14,410ఓట్లతో కాంగ్రెస్ ప్రత్యర్థి టి.దామోదర్‌రెడ్డిపై గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ నుండి చకిలం శ్రీనివాస్‌రావు 41,850ఓట్లతో సీపీఐ ప్రత్యర్థి బీ.రామశర్మపై విజయం సాధించారు. 1991లో సీపీఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షం 68,577ఓట్లతో కాంగ్రెస్ ప్రత్యర్థి చకిలం శ్రీనివాస్‌రావుపై గెలిచారు. 1996లోవరుసగా రెండోసారి సీపీఐ నుండి బొమ్మగాని ధర్మభిక్షం 71761ఓట్లతో బీజేపీకి చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డిపై విజయం సాధించారు. 1998ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా సురవరం సుధాకర్‌రెడ్డి 24,455ఓట్లతో కాంగ్రెస్ ప్రత్యర్థి వి.హనుమంతరావుపై నెగ్గారు. 1999ఎన్నికల్లో టీడీపీ నుండి గుత్తా సుఖేందర్‌రెడ్డి 79,735ఓట్లతో కాంగ్రెస్ ప్రత్యర్థి కనుకుల జనార్ధన్‌రెడ్డిపై గెలిచారు. 2004ఎన్నికల్లో సీపీఐ నుండి రెండోసారి సురవరం సుధాకర్‌రెడ్డి 56,151ఓట్లతో బీజేపీ ప్రత్యర్థి ఎన్. ఇంద్రసేనారెడ్డిపై గెలుపొందారు. 2009లో గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా 1లక్ష 52,982 ఓట్లతో సీపీఐ ప్రత్యర్థి సురవరం సుధాకర్‌రెడ్డిపై గెలిచారు. 2014ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గుత్తా సుఖేందర్‌రెడ్డి తన టీడీపీ ప్రత్యర్థి తేరా చిన్నపరెడ్డిపై 1,94,056 ఓట్లతో గెలుపొంది ముడోసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రాష్టమ్రంత్రి మండలిలో స్థానం ఆశిస్తున్న గుత్తా 2019పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు.