తెలంగాణ

మహిళల ఆర్థిక స్వావలంబన భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 15: తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబన చాలా బాగున్నదని, మహిళలు ఎంతో చైతన్యవంతులుగా ఉన్నారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా ప్రతినిధులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో స్వయం సహాయక సంఘాల పనితీరును శుక్రవారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లలిత్‌పూర్ జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు పరీశీలించి మహిళల ఆర్థిక స్వావలంబన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మండల పరిధిలోని కారేపల్లి వెనె్నల గ్రామసమాఖ్య, పేరుపల్లి గ్రామంలోని మహాత్మ గ్రామసమాఖ్యలను యూపీ బృందం సందర్శించింది. యూపీ నుండి ఎస్‌హెచ్‌జీలను పరిశీలించడానికి 31మంది సభ్యులు మూడు బృందాలుగా ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. రెండు టీమ్‌లు బ్లాక్ మేనేజర్ మోహన్‌సింగ్ ఆధ్వర్యంలో కారేపల్లి, పేరుపల్లిలో పరిశీలించగా, మరో బృందం నాయుడుపేటలో పర్యటించారు. తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో పలు ఉత్పత్తులు తయారు చేసి లాభాలు సాధించటంవంటివి ఆదర్శంగా నిలుస్తున్నాయి. యూపీలో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటులో అక్కడి మహిళలను చైతన్యం చేయటానికి తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య సభ్యులు వెళ్ళి అక్కడి మహిళలకు శిక్షణ ఇచ్చి చైతన్యం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ స్వయం సహాయక సంఘాల పనితీరు, మహిళ ఆర్థికాభివృద్ధిని క్షేత్రసాయిలో పరిశీలించడానికి యూపీ ప్రభుత్వం 31మంది మహిళా సభ్యుల బృందాన్ని ఖమ్మం జిల్లాకు పంపింది. స్తంభాద్రి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, డిపిఎం రేవతి ఆధ్వర్యంలో కారేపల్లి, పేరుపల్లిలో గ్రామాల్లో సంఘాల పనితీరును యుపీ సభ్యులకు వివరించారు. వారితో కారేపల్లిలోని రెండు గ్రామ సమాఖ్య సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి అనుభవాలను యుపి సభ్యులతో పంచుకున్నారు. అనేక అంశాలపై మహిళలు అనర్ఘళంగా మాట్లాడటం పట్ల యూపీ బృందం ఆశ్చర్యపోయింది. ఈ కార్యక్రమాల్లో యూపీ సభ్యులు పొదుపు, బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు, వసూళ్ళను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇక్కడి స్వయం సహాయక సంఘాలు పనితీరు ఆకట్టుకుందని యూపి సభ్యులు పేర్కొన్నారు. ఆర్థికంగా ఎదగటంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో తెలంగాణా మహిళల భాగస్వామ్యం అధికంగా ఉన్నదని, అధికారులను ప్రశ్నించగలుగుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం పాలడుగు హరినారాయణ, సిసి చైతన్య, గ్రూపు లీడర్లు మమత, యూపీ సభ్యులు ప్రియాంక, పుష్ప పాల్గొన్నారు.