తెలంగాణ

ఏపి జెన్‌కోను ముట్టడించిన తెలంగాణ రైతాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెంటచింతల, జూన్ 9: గుంటూరు జిల్లా రెంటచింతల మండల పరిధిలోని సత్రశాల వద్ద ఉన్న ఏపీ జెన్‌కో టెయిల్‌పాండ్ ప్రాజెక్టును గురువారం తెలంగాణ రైతులు ముట్టడించి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు ఆదిరామ్‌నాయక్, లాలూనాయక్ మాట్లాడుతూ ప్రాజెక్టునిల్వ నీటి కారణంగా తమ మంచినీటి ప్రాజెక్టులు ముంపునకు గురవుతున్నాయని అన్నారు. దీని వల్ల ఏడువేల ఎకరాల్లో పంటసాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తమ పొలాలు మునిగిపోతున్నా, ఇంతవరకు తమకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదన్నారు. పొలాలు తీసుకుని ఇంత వరకు తమ పిల్లలకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. గతంలో ఒక్కొక్క ఎకరానికి లక్ష రూపాయలు ఇచ్చారని, ఇప్పుడు ఆ పొలాల ధరలు 20 నుండి 25 లక్షల వరకు పెరిగాయన్నారు. రెవెన్యూ రికవరి యాక్టు ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. మునిగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ స్థానంలో, కొత్త లిఫ్ట్‌లను ఏర్పాటు చేయాలని, మునిగిపోయిన పొలాలను గుర్తించి, వాటికి వెంటనే పరిహారం అందించాలన్నారు. అందుకోసం అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల, పెదఊరమండలం చింతలపాలెం, జమ్మనకోట, నడిగడ్డ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. అనంతరం ఏపీ జెఎన్‌కో ఎస్‌ఈ పిడిఎల్ కుమార్, ఈఈ తిరుపతయ్యలకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు.