తెలంగాణ

జూపల్లి వర్సెస్ రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, జూన్ 9: మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలంలో గురువారం జరిగిన అభివృద్ధి పనుల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరూ వ్యక్తిగత దూషణలు పాల్పడ్డారు. ఈ సంఘటన కోస్గి మండలంలోని బోదారం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...గ్రామానికి మంజూరైన రోడ్లను పరిశీలించిన మంత్రి జూపల్లి అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గతంలో ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్ర సాధనకు అడ్డుతగిలారని, ప్రస్తుతం ప్రాజెక్టుల కోసం మళ్లీ అడ్డుతగులుతున్నారని నిప్పులు చెరిగారు. దీంతో అక్కడే ఉన్న కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని మంత్రి మాట్లాడుతున్న మైకును లాక్కోబోయారు. దీంతో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలే కానీ రాజకీయాలు చేయవద్దని రేవంత్‌రెడ్డి అనడంతో ఇద్దరి మధ్య మాటల దుషణలు కొనసాగాయి. నువ్వు చేసిన అభివృద్ధి ఏమిటో... నేను చేసిన అభివృద్ధి ఏమిటో తేల్చుకుందామని వారు సవాల్ విసురుకున్నారు. ఒకదశలో నువ్వెంత అంటే నువ్వెంత అనేవిధంగా వాదించుకున్నారు. ఈ సమయంలో రెండు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేస్తూ వేదిక వద్దకు దూసుకుపోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జి చేసి ఎక్కడ వారిని అక్కడికి పంపించి సమస్య తీవ్రత లేకుండా చూశారు.