తెలంగాణ

నల్లగొండ నుంచే ‘విస్తరణ’ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 9: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలన్న బిజెపి లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణలో సైతం ఆ పార్టీ నాయకత్వం పలు వ్యూహాలను అమలు చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బిజెపి దేశవ్యాప్తంగా చేపట్టిన ‘వికాస్ పర్వ్’ కార్యక్రమం ద్వారా తెలంగాణలో బిజెపి విస్తరణకు ఆ పార్టీ ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో ఆది నుండి ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన నల్లగొండ జిల్లా నుండే బిజెపి తెలంగాణ విస్తరణ వ్యూహం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడైన అమిత్‌షాతో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జిల్లాలోని సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్ధపడింది. సూర్యాపేట త్వరలో కొత్తగా జిల్లా కేంద్రంగా అవతరించనుండటంతో ఇక్కడ అమిత్‌షాతో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా బిజెపి ప్రభావాన్ని నల్లగొండ జిల్లా అంతటా విస్తరించవచ్చని కమలనాధుల ఆలోచనగా ఉంది. పోరుగడ్డ నీలగిరిలో కమల వికాసం సాధిస్తే తెలంగాణ గట్టుపై కమలం జెండా రెపరెపలాడించవచ్చని కమలదళం ఆశిస్తోంది. అదీగాక తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక ఫిరాయింపులతో కాంగ్రెస్, టి.టిడిపి బలహీన పడుతుండగా, వామపక్షాలు ఉనికిని కాపాడేందుకు తంటాలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తామే సరైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామన్న సందేశాన్ని సూర్యాపేట సభతో చాటిచెప్పాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టిఆర్‌ఎస్‌కు ధీటుగా ఉద్యమాలు సాగించిన బిజెపి తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతునిచ్చి రాష్ట్ర ఏర్పాటుపై తన నిబద్ధతను చాటుకుంది. అయితే రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించేందుకు తెలంగాణకు మద్ధతునిచ్చిన పార్టీ అన్న సెంటిమెంట్ ఒక్కటే సరిపోదని గ్రహించిన బిజెపి రాష్ట్రంలో ఇటీవల ప్రతిపక్షంగా అధికార టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాందోళనలను ఉధృతం చేసింది. అటు అసెంబ్లీలో, ఇటు ప్రజాక్షేత్రంలో కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలను సాగిస్తు ఒకవైపు, నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ప్రచారం చేస్తు ఇంకోవైపు ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. 2019ఎన్నికల నాటికి టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలబడేందుకు బిజెపి చేపట్టిన కార్యాచరణ దిశగా సూర్యాపేట సభ ముందడుగు కావాలని కమలనాధులు భావిస్తున్నారు. సూర్యాపేట బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గత పది రోజులుగా బిజెపి శ్రేణులు జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో అమిత్‌షా బహిరంగ సభకు జనసమీకరణకు విస్తృత ప్రచారం సాగించాయి.