తెలంగాణ

బ్యాంకర్లకు మంత్రి పోచారం సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: రుణమాఫీతో సంబంధం లేకుండా బ్యాంకర్లు పంట రుణాలు పునరుద్ధరించాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. రుణమాఫీ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందని, దశల వారిగా దీనికి సంబంధించి నిధులు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. సచివాలయంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. రుణమాఫీ బకాయిలు చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. బ్యాంకులు రైతులను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. కేంద్రం నుంచి కరువు నిధులు రావాల్సి ఉందని, నిధులు వచ్చాక కరువు మండలాల రైతులకు పెట్టుబడి రాయితీ అందజేస్తామని చెప్పారు. లక్ష లోపు పంట రుణాలకు బ్యాంకర్లు వడ్డీ వసూలు చేయవద్దని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఖరీఫ్‌కు ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేదని మంత్రి తెలిపారు. పాలిహౌస్ బీమా కల్పనకు రెండు కంపెనీలు ముందుకు వచ్చినట్టు, త్వరలోనే ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు.