తెలంగాణ

దవాఖానాల్లో ఇక బయోమెట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులతో పాటు ఇతర సిబ్బంది కూడా సమయానికి విధులకు హజరయ్యేలా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలోని ప్రభుత్వ దంత వైద్యశాల, కోఠిలోని మహిళా హాస్టల్‌లలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దంతవైద్య కళాశాల నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 12.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నూతన భవనంలో సర్జరీ, రేడియాలజీ, ల్యాబ్, ఆడిటోరియంలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ దంతవైద్య కళాశాలకు మంచి గుర్తింపు తెచ్చేలా సిబ్బంది వ్యవహరించాలన్నారు. అన్ని ఆసుపత్రిల్లోని వైద్యులు, సిబ్బంది కూడా సర్కారు ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం పెంచేలా వ్యవహరించాలని సూచించారు. వైద్యులు, ఇతర సిబ్బంది రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించటం మాని కాస్త మానవత్వంలో వ్యవహరించాలని ఆయన సూచించారు. వైద్య రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.