తెలంగాణ

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 8: నిజామాబాద్ జిల్లాలో బుధవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఆరుగురు మృత్యువాతపడగా, నాగిరెడ్డిపేట మండలం బంజారతండా వద్ద టివిఎస్ మోపెడ్‌పై వెళ్తున్న వారిని ఇసుక లారీ ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్‌లోని దుబ్బకు చెందిన గణేష్ (30), సత్యనారాయణ (27)లు బుధవారం గణేష్‌కు చెందిన ఆటోరిక్షాలో అతని మూడేళ్ల కుమార్తె గంగోత్రి, చెల్లెలు రుచిత (15), నితీష్ (19)తో పాటు అతని సతీమణి రచన, కుమారుడు స్వస్తిక్‌లు (3)లు బాసరకు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఫకీరాబాద్ సమీపంలో ముందున్న మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న నిజామాబాద్ నుండి భైంసాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో గణేష్, నితీష్, రుచితలు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ స్వస్తిక్, గంగోత్రి, సత్యనారాయణ, రచనలను జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో రచన మినహా మిగతా ముగ్గురూ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందారు. రచన ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. దైవ దర్శనానికి వెళ్లి అనుకోని రీతిలో ప్రమాదానికి లోనై ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాతపడడం విషాదాన్ని మిగిల్చింది. ఇదిలాఉండగా, నాగిరెడ్డిపేట మండలం బంజారతండా వద్ద జరిగిన ప్రమాదంలో అదే మండలంలోని లింగంపల్లికి చెందిన చెన్నబోయిన పోచయ్య, రొడ్డ పోచయ్యలు అర్ధాంతరంగా తనువులు చాలించారు. వీరిరువురు టివిఎస్ మోపెడ్‌పై వెళ్తుండగా, ఇసుక లారీ బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

చిత్రం... ఫకీరాబాద్ గ్రామ శివారులో సంభవించిన రోడ్డు ప్రమాదంలో
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నుజ్జునుజ్జయన ఆటో