తెలంగాణ

ఆగే పోరు కాదిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: ‘ఎన్ని అవాంతరాలు ఎదురైనా, దాడులు జరిగినా మా పోరాటం ఆగదు’ అని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టి.జాక్) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. ‘మాకు ప్రజా ప్రయోజనాలు తప్ప రాజకీయ ప్రయోజనాలు లేవు. ప్రజల కోసం పని చేయడం, వారి పక్షాన నిలబడటం తప్ప ఏరకమైన ప్రయోజనాలు లేవు’ అన్నారు. ఎవరికో ఆగ్రహం వస్తుందని ప్రజా సమస్యలపై నిలదీయడం మానుకోవాలా? అని కోదండరామ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన కోదండరామ్‌పై మూకుమ్మడిగా మంత్రులంతా విరుచుకుపడటంతో టి.జాక్ స్టీరింగ్ కమిటీ బుధవారం అత్యవసరంగా సమావేశమై తాజా పరిణామాలపై చర్చించింది. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను కోదండరామ్ మీడియాకు వెల్లడించారు. ముందు రాష్ట్రం కోసం పోరాటం, రాష్ట్రావిర్భావం తరువాత తెలంగాణలోని సమస్యలపై పోరాటం సాగుతుందని టి.జాక్ ఏర్పాటు చేసిన రోజునే చెప్పామని గుర్తు చేశారు. తెలంగాణలో టి.జాక్ లేదనుకున్నపుడు, మంత్రులంతా ఎందుకు స్పందించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వారిలాగా (మంత్రులు) మాట్లాడటానికి ఆ భాష తనకు రాదని, తమ డిక్షనరీ చాలా చిన్నదని కోదండరామ్ వ్యగ్యంగా అన్నారు. అయినా తాను నలుగురికి చెప్పేస్థితిలో ఉన్నానే తప్ప, ఇంకొకరితో చెప్పించుకునే స్దితిలో లేనన్నారు. ప్రజలపక్షాన నిలబడుతూ, వారిపక్షాన పోరాడుతూనే ఉంటామని ఉద్ఘాటించారు. ప్రజా సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లాలని మూడు నాలుగుసార్లు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా ఫలించలేదని అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్టవ్య్రాప్తంగా జెఎసి పర్యటించి ప్రజలతో ముఖాముఖి చర్చించి వచ్చిందన్నారు. కరవు పరిస్థితులు, ఒపెన్ కాస్ట్ మైనింగ్, ఖాయిలాపడిన పరిశ్రమలు, విద్యారంగ సమస్యలపై జెఎసి చర్చించిందన్నారు. రాష్ట్రంలో వర్సిటీలకు విసీలు లేరు, బోధనా సిబ్బంది లేరని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ఉస్మానియా వర్సిటీలో సదస్సు నిర్వహించాలని జెఎసి నిర్ణయించిందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండాల్సిందే అంటూనే, వాటిపై పోలీసులతో దాడులు చేయించడాన్ని జెఎసి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పోలీసులతో దాడులు చేయించడాన్ని హైకోర్టు తప్పుబట్టినా ప్రభుత్వం వినిపించుకోలేదన్నారు. విద్యారంగ సమస్యలపై త్వరలో జెఏసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి చర్చిస్తుందని కోదండరామ్ వెల్లడించారు. ఒపెన్ కాస్ట్ మైనింగ్‌లకు వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్తామన్నారు. హైకోర్టు విభజన జరుగకపోవడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, చివరికు తమకు అన్యాయం జరుగుతోందంటూ న్యాయమూర్తులే ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడిందని కోదండరామ్ అన్నారు. జెఎసిని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం నడుచుకోకుండా, కేవలం జీవోలు జారీ చేసి ప్రజలను వేధించడం మంచిది కాదన్నారు. అలాంటి ప్రయత్నాలు వద్దని చెప్పడానికే మలన్నసాగర్ బాధితులకు తరఫున నిలబడ్డామన్నారు. మల్లన్నసాగర్ బాధితులతో గజ్వేల్‌లో (సిఎం నియోజకవర్గం) త్వరలోనే సదస్సు ఏర్పాటు చేయాలని జెఎసి నిర్ణయించిందని కోదండరామ్ తెలిపారు.
chitram...
మీడియాతో మాట్లాడుతున్న కోదండరామ్