తెలంగాణ

టి.ఎంసెట్-2 దరఖాస్తు గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణలో నిర్వహిస్తున్న ఎంసెట్-2 దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 14వ తేదీ వరకూ గడువు పెంచారు. 500 రూపాయల జరిమానాతో జూన్ 20 వరకూ, వెయ్యి రూపాయిల జరిమానాతో 25వ తేదీ వరకూ, 5వేల జరిమానాతో 30వ తేదీ వరకూ, 10వేల జరిమానాతో జూలై 6వ తేదీ వరకూ పొడిగించారు. జూలై 1 నుండి అభ్యర్ధులు తమ హాల్‌టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష జూలై 9వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. తొలి కీని అదే రోజు ప్రకటిస్తారు. 12వ తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరించి, 14వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
53వేల దరఖాస్తులు
ఇంత వరకూ ఎంసెట్-2కు 53వేల దరఖాస్తులు వచ్చాయి. అందులో అబ్బాయిలు నుండి 17500, అమ్మాయిలు నుండి 35500 దరఖాస్తులు వచ్చాయి. ఒయు ఏరియా నుండి 33589, ఎయు 9806, ఎస్వీయు నుండి 6771 దరఖాస్తులు వచ్చాయి.