తెలంగాణ

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు రెండు పెద్ద సవాళ్లు ఉన్నాయి. రెండు వేల కోట్ల రూపాయల లోటును భర్తీ చేసేందుకు విద్యుత్ చార్జీలను, ఏడు వందల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఆర్టీసిని గట్టెక్కించేందుకు బస్సు చార్జీలను పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. కాని ఏ మేరకు పెంచాలనే దానిపై ఇంతవరకు రాష్ట్రప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. విపక్ష పార్టీలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయనుకున్న తరుణంలో తెలంగాణ జాక్ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ కెసిఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై దాడి చేయడం, కెసిఆర్‌ను వ్యతిరేకించే శక్తులు కోదండరామ్ ఆధ్వర్యంలో సంఘటితమయ్యే ప్రమాదం ఉందని, దీనివల్ల అనవసరంగా ప్రతిపక్ష పార్టీలకు ఆయుధం ఇచ్చినట్లవుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీంతో గత నెల రోజులుగా ఆర్టీసి, విద్యుత్ చార్జీల పెంపుదలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుతోందని సమాచారం.
తెలంగాణ డిస్కాంలు విద్యుత్ టారిఫ్‌ను ఇవ్వగా, టిఎస్‌ఇఆర్‌సి బహిరంగ విచారణను నిర్వహించింది. తెలంగాణ విద్యుత్ సంస్ధల అధికారులు కూడా కెసిఆర్‌ను కలిసి విద్యుత్ చార్జీలను పెంచడం అనివార్యమని, ప్రతిపాదించిన టారిఫ్‌లో సగమైనా అంటే కనీసం రూ.1000 కోట్లు పెంచితే తప్ప కష్టాల నుంచి గట్టెక్కలేమని కోరారు. విద్యుత్ చార్జీలను జూన్ 1వ తేదీ నుంచి పెంచే విధంగా టిఎస్‌ఇఆర్‌సి గత నెల 31వ తేదీలోపల ప్రకటన చేయాల్సి ఉండగా, అది వాయిదా పడింది. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో విద్యుత్ చార్జీలను పెంచడం సరికాదని ప్రభుత్వం అభిప్రాయపడింది. అంతకు ముందు పెంచుదామనుకుంటే పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఇక రాష్ట్రప్రభుత్వం విద్యుత్ చార్జీలపై ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. విద్యుత్ రంగానికి రూ. 4500 కోట్ల సబ్సిడీ ఇచ్చినా ఇంకా రూ.4000 కోట్ల లోటును డిస్కాంలు పూడ్చుకోవాల్సి ఉంటుంది.
ఏపిఎస్‌ఆర్టీసి పూర్తిస్థాయిలో విభజన కాకపోయినా, తెలంగాణ ఆర్టీసి వాటాకు రూ. 700 కోట్లల నష్టాలు సంక్రమించాయి. ఆర్టీసి ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఆర్టీసి కష్టాలు తీవ్రమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగు నెలల క్రితమే ఆర్టీసి చార్జీలను పెంచింది. తెలంగాణ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇప్పుడు ఇంధనం రేట్లు పెరగడం, ఉద్యోగుల వేతన భారం నానాటికి మోయలేని విధంగా ఉండడంతో కొంతమేరకు ఆర్టీసి చార్జీలను పెంచని పరిస్థితులు నెలకొన్నాయి.
2012లో చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసి చార్జీలను పెంచింది. నాలుగేళ్లయినా ఇంకా పాత చార్జీలు కొనసాగుతుండడంతో అంతరంగిక సమావేశాల్లో కార్మిక సంఘాలు, ఉన్నతాధికారులు కూడా అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు చార్జీలను పెంచకతప్పదని ఆర్టీసి యాజమాన్యాన్ని కోరుతున్నాయి. ఈ రెండు అంశాలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆకస్మికంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ వాతావరణం నేపథ్యంలో విద్యుత్, ఆర్టీసి సంస్ధల చార్జీల పెంపుదలపై ప్రభుత్వం మీమాంసలో పడింది.