తెలంగాణ

లాసెట్ టాపర్ వేణుధర్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: తెలంగాణలో న్యాయవిద్యను అభ్యసించేందుకు నిర్వహించిన మూడు ప్రవేశపరీక్షల ఫలితాలను సోమవారం సాయంత్రం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాకతీయ యూనివర్శిటీ ఇన్‌ఛార్జి విసి చిరంజీవులు, కన్వీనర్ ప్రొఫెసర్ ఎం వి రంగారావులు విడుదల చేశారు. మూడేళ్ల కోర్సునకు మూడేళ్ల లాసెట్ ఐదేళ్ల కోర్సునకు ఐదేళ్ల లాసెట్, పిజి కోర్సులకు ఎల్‌ఎల్‌ఎం పరీక్షను గత నెల 24వ తేదీన నిర్వహించారు. తొలి కీని కమిటీ 26న ప్రకటించి తుది కీతో పాటు ఫలితాలను సోమవారం నాడు ప్రకటించారు. ఎల్‌ఎల్‌ఎంకు 1789 మంది రిజిస్టర్ చేసుకోగా, పరీక్షకు 1629 మంది హాజరయ్యారు. వారిలో 1620 మంది క్వాలిఫై అయ్యారు. ఎల్‌ఎల్‌బి మూడేళ్ల కోర్సునకు 13310 మంది దరఖాస్తు చేయగా, 11630 మంది హాజరయ్యారని, 9897 మంది అర్హత సాధించారని, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బికి 4099 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 3561 మంది హాజరయ్యారని, అందులో 2811 మంది అర్హత సాధించారని చెప్పారు. అర్హత సాధించిన వారిని చూసుకుంటే పిజిఎల్‌సెట్‌లో 421 మంది, లాసెట్ మూడేళ్ల కోర్సులో 2070 మంది, లాసెట్ ఐదేళ్ల కోర్సులో 873 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. అర్హులు అంతా వెబ్ సైట్ నుండి తమ ర్యాంకు కార్డులను 9 వతేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవి రంగారావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌ఎల్‌ఎం కోర్సునకు పిజిఎల్‌సెట్ పరిధిలో 11 కాలేజీలు ఉన్నాయని వాటిలో 545 సీట్లు ఉన్నాయని, ఎల్‌ఎల్‌బి మూడేళ్ల కోర్సును 17 కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయని అందులో 2670 సీట్లు ఉన్నాయని, ఎల్‌ఎల్‌బి ఐదేళ్ల కోర్సులో 10 సీట్లు ఉన్నాయని అందులో 960 సీట్లు ఉన్నాయని కన్వీనర్ వివరించారు.
టాపర్లు వీరే
మూడేళ్ల లాసెట్‌లో 120 మార్కులకు గానూ 104 మార్కులు సాధించి 1వ ర్యాంకును టి వేణుధర రెడ్డి సాధించారు. 104 మార్కులతో రెండో ర్యాంకు ఎం రాఘవేందర్ గౌడ్, 100 మార్కులతో 3వ ర్యాంకు పి దిలీప్‌కుమార్(ఎపి) , 99 మార్కులతో 4వ ర్యాంకు కె. ప్రశాంత్‌రెడ్డి, 98 మార్కులతో ఐదో ర్యాంకు బి అభివవ్ కుమార్, ఆరో ర్యాంకు సి వీరభద్రం, ఏడో ర్యాంకు టి దేవేందర్ రెడ్డి, 8వ ర్యాంకు టి లఖావత్ జీవ్లా, 9వ ర్యాంకు ఎ రవీందర్, 10వ ర్యాంకు కె నాగార్జున సాధించారు. అమ్మాయిల్లో 11వ ర్యాంకు సాధించిన వి రీతాశ్రీ ప్రధమ స్థానంలో , 28వ ర్యాంకు సాధించిన పి స్వప్నప్రియ అమ్మాయిల్లో రెండో స్థానంలో నిలిచారు.
ఐదేళ్ల కోర్సు విజేతలు
ఐదేళ్ల లా కోర్సునకు జరిగిన పరీక్షలో సి నవీన్‌కుమార్ 1వ ర్యాంకు, వి సుప్రీత్ రెండో ర్యాంకు, బానోతు భాస్కర్ మూడో ర్యాంకు, ఎన్ మల్లారెడ్డి నాలుగో ర్యాంకు సాధించారు. సన్నిధానం సౌమ్య 5వ ర్యాంకు, కీసరి నర్సినరెడ్డి ఆరో ర్యాంకు, హజ్ర కుల్సం ఏడో ర్యాంకు, గూడూరు శ్రీకుమార్ 8వ ర్యాంకు, చింతకుంట హర్షిత్ 9వ ర్యాంకు, ఎం ప్రవీణ్‌కుమార్, నజీర్‌హుస్సేన్‌లు 11వ ర్యాంకు సాధించారు.
పిజి లాసెట్‌లో
పిజి లాసెట్‌లో నేహా అగర్వాల్ ఫస్టు ర్యాంకు, సి రామకృష్ణారావు 2వ ర్యాంకు, ఎం అపర్ణ 3వ ర్యాంకు, కె సదర్శన్‌రెడ్డి 4వ ర్యాంకు, జి కృష్ణ చైతన్య ఐదో ర్యాంకు, టి నిషిత్ 6వ ర్యాంకు, ఎ.చంద్రశేఖర్ 7, మహ్మద్ ఫైజన్ అజీజ్ 8, బార్ల మల్లేష్ యాదవ్ 9వ ర్యాంకు, జీజల రాజశేఖర్‌రెడ్డి 10వ ర్యాంకు సాధించారు.

chitram 1వ ర్యాంకు టి వేణుధర రెడ్డి