తెలంగాణ

కాలేజీలున్నా.. సిబ్బంది లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: మూడేళ్లుగా రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరుచేసుకుంటూ పోతున్నా, అక్కడ పనిచేయాల్సిన బోధన సిబ్బందిని, బోధనేతర సిబ్బందిని నియమించకపోవడంతో అటెండర్ నుండి ప్రిన్సిపాల్ పదవి వరకూ అంతా తాత్కాలిక పద్ధతిలో పనిచేయాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 128 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. అందులో ఐదు కాలేజీలు మాత్రమే నేక్‌తో గుర్తింపు పొంది ఏ గ్రేడ్ సంపాదించాయి. మరో 49 డిగ్రీ కాలేజీలకు కేవలం బి గ్రేడ్ మాత్రమే వచ్చింది. 8 కాలేజీలకు సి గ్రేడ్ వచ్చింది. మిగిలిన 66 కాలేజీల్లో 52 కాలేజీలు 2010 కంటే ముందే ఏర్పాటయ్యాయి. అంటే అపుడే ఆరేళ్లు దాటినా అక్రిడిటేషన్‌కు తప్పనిసరి వెళ్లాల్సిన గడువు సమీపించినా, ఆ కాలేజీలు మాత్రం నేక్ అక్రిడిటేషన్‌కు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడానికి కారణం అక్కడ సిబ్బంది సహా కనీస వౌలిక సదుపాయాలు లేకపోవడమే, ఇందులో చాలా కాలేజీలకు సొంత భవనాలే లేవు, దాదాపు ఈ కాలేజీలు అన్నీ జూనియర్ కాలేజీల్లో బతుకు ఈడుస్తున్నాయి. మరికొన్ని మరీ దారుణంగా ప్రాథమిక పాఠశాలల్లో నడుస్తున్నాయి. ఈ కాలేజీలు రికార్డుల్లో నడుస్తున్నా, ఇంత వరకూ వాటికి బోధన సిబ్బందిని నియమించుకునే భాగ్యం కాలేజీయేట్ కమిషనరేట్‌కు దక్కలేదు, కారణం 1235 పోస్టులకు ప్రభుత్వం ఇంకా మంజూరు సైతం ఇవ్వకపోవడమే, ఈ మంజూరు లభిస్తే కనీసం వీటి రిక్రూట్‌మెంట్‌కు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు రాయవచ్చని అధికారులు యోచిస్తున్నారుస. ఇంకో పక్క 2761 మంజూరుపోస్టుల్లో సైతం చాలా మంది రిటైరయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్నది 1656 మంది మాత్రమే 1105 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఎప్పటికపుడు ఒకరిద్దరికి పదోన్నతి కల్పిస్తున్నా ఖాళీలు కొనసాగుతునే ఉన్నాయి. అంటే ఇప్పటికపుడు 2340 పోస్టులను ఇప్పటికపుడు భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సవ్యంగా విద్యాసంస్థలు నడవాలంటే శాశ్వత లెక్చరర్లను నియమించడం అనివార్యమని అధ్యాపక సంఘాల నాయకులు చెబుతున్నారు.