తెలంగాణ

కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: కార్మికుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. జెనీవాలో 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ కార్మికుల సదస్సుకు హాజరయ్యేందుకు దత్తాత్రేయ నేతృత్వంలో ప్రతినిధుల బృందం బయలుదేరి వెళ్ళింది. ఈ బృందంలో రాజస్థాన్, హర్యానా, మణిపూర్, తెలంగాణ రాష్ట్రాల కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రులు, మరో 8 మంది అధికారులు తదితరులు ఉన్నారు.
కేంద్ర మంత్రి దత్తాత్రేయ జెనివా బయలుదేరి వెళ్ళడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ సదస్సులో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, సామాజిక భద్రత ఉండాలని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండేళ్ళలో కార్మికుల సంక్షేమానికి చేపట్టిన పథకాల గురించి వివరించనున్నట్లు ఆయన తెలిపారు. కార్మికుల సమస్యలు ప్రధాని మోదీకి తెలుసునని అన్నారు. ఇటీవల ప్రధాని మోదీ ఖతార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ నివసించే భారత దేశం కార్మికుల గురించి చెప్పి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారని ఆయన చెప్పారు. ఇపిఎఫ్‌వో కార్పస్ ఫండ్ 7,53,000 కోట్ల రూపాయలు ఉన్నదని తెలిపారు.