తెలంగాణ

అమరులను మరువొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: అమరవీరుల త్యాగాలు నిత్య స్మరణీయాలని, ఆటుపోట్లతో ఉద్యమం మొదలై ఆత్మహత్యలు చేసుకుంటేనేకానీ రాష్ట్రావతరణకు అంకురార్పణ జరగలేదని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రతిపక్షాలు ముసలి కన్నీరు కారిస్తే సరిపోదని అమరవీరుల కుటుంబాలను మర్చిపోకూడదని సూచించారు. రవీంద్రభారతిలో సోమవారం తేజ ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో బైసా దేవదాసు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న తెలంగాణ అమరవీరుల స్మృతి కవితా సంకలనం ‘అక్షర నివాళి’ పుస్తకావిష్కరణకు అల్లం నారాయణ అధ్యక్షత వహించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుండాలని, అమరవీరులు తెలంగాణ గడ్డపై కలకాలం చిరస్మరణీయంగా వుండాలని శ్రీకాంతచారి, యాదగిరి తదితరుల త్యాగాలు నిత్యస్మరణీయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి మాట్లాడుతూ 1969 నాటి ఉద్యమం మొదలు రాష్ట్రం సిద్ధించేవరకు జరిగిన పరిణామాలు ఈ పుస్తకంలో ఉన్నాయన్నారు. త్యాగాలు చేసినవారిని ప్రభుత్వానికి గుర్తు చేసేదిలా ఈ పుస్తకం వుందని రమణాచారి అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంతచారి తల్లిని సత్కరించారు.