తెలంగాణ

సీమాంధ్రుల కుట్రలో భాగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేస్తున్న విమర్శలు దుమారాన్ని రేపుతున్నాయ. ఈ విమర్శలపై పలువురు మంత్రులు తీవ్రస్థాయలో ధ్వజమెత్తారు. సీమాంధ్రుల కుట్రల్లో భాగంగానే కోదండరామ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కరీంనగర్‌లో సోమవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటులో కెసిఆర్ చూపిన తెగువను పొగిడిన కోదండరామ్ నేడు ముఖ్యమంత్రి పాలనను ప్రశ్నించటం వెనుక ఆంతర్యమేంటని నిలదీశారు. కొత్తరాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు కొనసాగుతున్నాయని పదేపదే ప్రకటించి, జాగృతం చేసిన ఆయనే నేడు వాటికి ఆజ్యం పోస్తుండటం వెనుక ఎవరి ప్రమేయం ఉందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజకీయ జెఎసి ఆవిర్భావానికి ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని, రక్తం బొట్టు చిందించకుండా ప్రజాస్వామ్యయుతంగా కొత్త రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సిఎం కెసిఆర్ త్యాగానికి ప్రతిరూపమే నేటి తెలంగాణ రాష్టమ్రని చెప్పారు. తమ ఉద్యమంతో వచ్చిందని జబ్బలు చరుచుకోవటం వారి అవివేకమని మండిపడ్డారు. వ్యక్తులుగా ఆలోచించకుండా తెలంగాణ సమాజ శ్రేయస్సుపై ఆలోచించటం ఉద్యమకారుల నైజమని, ఈ విషయాన్ని కోదండరామ్ గుర్తుంచుకోవాలని ఈటల హితవు పలికారు. దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణను ఎవరడ్డు వచ్చినా, ఎనె్నన్ని కుట్రలు చేసినా బంగారుమయం చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే యత్నం చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈసమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, జడ్పీటీసి సిద్దం వేణు తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతారహితంగా మాట్లాడరాదు : తలసాని
మహబూబ్‌నగర్: ప్రభుత్వం గురించి కోదండరామ్ బాధ్యతారహితంగా మాట్లాడడం సమంజసం కాదని, ఆయన ఏదైనా రాజకీయ పార్టీలోకి చేరాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో సోమవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, కెసిఆర్ సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి సమయంలో కోదండరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేసిఆర్ అమలు చేస్తున్నారని తలసాని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్లానింగ్ బోర్డు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పాల్గొన్నారు.
అసలు రంగు బయటపడింది..
వరంగల్: పెద్ద మనిషిగా సమాజంలో గుర్తింపు పొందిన కోదండరామ్ ఉన్నట్లుండి ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. వరంగల్‌లో సోమవారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, కోదండరామ్ నిజ స్వరూపం బట్టబయలైందని, ఎవరికి కొమ్ము కాయడానికి ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశాడో అర్థవౌతోందని అన్నారు. కెసిఆర్ పాలనకు ఇటీవల వరుసగా జరిగిన ఉప ఎన్నికలు, జిహెచ్‌ఎంసి, జిడబ్ల్యుఎంసి, ఖమ్మం, సంగారెడ్డి పురపాలక సంఘ ఎన్నికలే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన నచ్చే ప్రజలు వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో తెరాసకు పట్టం కడుతున్నారని ఆయన చెప్పారు. గౌరవప్రదమైన వ్యక్తిగా కోదండరామ్ ప్రభుత్వానికి అవసరమైన సలహాలు ఇవ్వాలే తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, తెరాస పొలిట్ బ్యూరో సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నగర మేయర్ నన్నపనేని నరేందర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సిఎంను విమర్శిస్తే సహించం..
మెదక్: రాష్ట్రం బాగుకోసం సూచనలు సలహాలు ఇవ్వాలని, అంతేతప్ప ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదని శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను హెచ్చరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పాలకులకు చేతకాకపోతే పక్కకు తప్పుకోండని కోదండరాం వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. మెదక్ క్యాంప్ ఆఫీస్‌లో సోమవారం ఆమె విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కోదండరామ్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

chitram వేర్వేరు విలేఖరుల సమావేశాల్లో మాట్లాడుతున్న మంత్రులు ఈటల రాజేందర్, లక్ష్మారెడ్డి