తెలంగాణ

ప్రాజెక్టుల పేరుతో ముంచేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూన్ 6: ప్రాజెక్టులు నిర్మించే ముందు వాటి వల్ల కలిగే లాభనష్టాలపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని, ప్రజాభిప్రాయం మేరకు భూసేకరణ చేపట్టాలని టిజెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బలవంతంగా భూసేకరణ చేపట్టడం చట్టసమ్మతం కాదని ఆయన స్పష్టం చేశారు. మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్, వేములగాట్ గ్రామాల్లో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలేదీక్షలకు తెలంగాణ విద్యావంతుల వేదిక, టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవిందర్‌కుమార్, రాంచంద్రంతో కలిసి కోదండరామ్ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల పేరుతో గ్రామాలను ముంచడం సరికాదన్నారు. ఈ విషయమై నర్మదా బచావో ఉద్యమ నేత మేథాపాట్కర్‌ను సంప్రదించామని, ముంపు గ్రామాల ప్రజలకు భరోసా కల్పించేందుకు అవసరమైతే ఆమెను కూడా తీసుకొస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లోని ప్రజలు ముంపునకు గురైతే భూనిర్వాసితులు, ఇండ్లున్న వారికి పరిహారాలు వస్తాయని, అవి లేని వారి పరిస్థితి ఏమిటని ఆయన కెసిఆర్ సర్కారును నిలదీశారు. ప్రజలకు చట్టాలు, జిఓలు, ప్రాజెక్టుల ఏర్పాటుపై అవగాహన కల్పించేందుకు త్వరలోనే పెద్దలు, మేధావులతో కలిసి సదస్సును నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు సునందాబాయి, మంజుల, పిఏసిఎస్ చైర్మన్ కూరాకుల మల్లేశం, నాయకులు మల్లేశం, రమేశ్, పరిపూర్ణచారి, శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి, మోహన్‌రావు, ప్రసాద్, గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.