తెలంగాణ

రూసా పథకం కింద రాష్ట్రానికి రూ.168 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: రాష్ట్రీయ ఉచ్ఛాతార్ శిక్షా అభియాన్ (రూసా) పథకం కింద రాష్ట్రానికి రూ.168 కోట్లు మంజూరైనట్టు కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ వాణి ప్రసాద్ చెప్పారు. డిగ్రీ కాలేజీల్లో సౌకర్యాలను కల్పించడంతో పాటు ఉన్నత ప్రమాణాలను నెలకోల్పేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఆమె సోమవారం నాడు పాత్రికేయులకు వివరించారు. కాలేజీయేట్ ఎడ్యుకేషన్‌లో ఇటీవలి కాలంలో చేపట్టిన సంస్కరణలను ఆమె వివరించారు. మన టీవీ ద్వారా పాఠ్యాంశాల ప్రసారం, తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జి సెంటర్లు ద్వారా శిక్షణ, డిగ్రీ కాలేజీల్లో ఆరోగ్యం, పరిశుభ్రత క్లబ్‌లు, డిగ్రీ కాలేజీల నేక్ గుర్తింపు , అటానమస్ కాలేజీల పనితీరు, కాలేజీల్లో స్పోర్ట్సు డెవలప్‌మెంట్, ఫైనల్ ఇయర్ విద్యార్ధులకు నగదు పారితోషికం, విద్యార్ధుల్లో మానవీయ విలువలు, వృత్తిపరమైన నైతికత అంశాలపై చైతన్య పరచడంపై తీసుకున్న చర్యలను వాణీ ప్రసాద్ వివరించారు. డిగ్రీ కాలేజీలను విద్యార్ధులకు చేరువ చేయడం, అందరికీ సమాన అవకాశాలను అందించడం, ప్రమాణాలను పెంచడం వంటి అనేక కార్యక్రమాలకు రూసా నిథులను వినియోగిస్తున్నట్టు చెప్పారు. కొత్త మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ఒక్కో దానికి 12 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. ఉస్మానియా, జెఎన్‌టియుల్లో వౌలిక సదుపాయాలకు 20 కోట్లు చొప్పున మూడు డిగ్రీ కాలేజీల స్థాయిని పెంచి మోడల్ డిగ్రీ కాలేజీలుగా మార్చేందుకు నాలుగు కోట్లు చొప్పున కేటాయించారు. 33 డిగ్రీ కాలేజీలకు ఒక్కో దానికి రెండు కోట్లు చొప్పున కేటాయించామని అన్నారు. అలాగే డిగ్రీ కాలేజీల్లో లింగవివక్ష నిరోధానికి అందరిలో సమానత్వ భావన రగిలించేందుకు ప్రత్యేక కోర్సు ఆఫర్ చేస్తున్నామని, దానికి ఫస్టియర్ సెకండ్ సెమిస్టర్‌లో చేర్చామని అన్నారు. ఇందుకు రెండు క్రెడిట్స్ ఇస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ చాప్టర్ కోసం కరిక్యులమ్ రూపొందించామని పేర్కొన్నారు. ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో సిబిసిఎస్ పద్ధతి అమలుచేస్తున్నామని, ప్రతి సెమిస్టర్ మార్కులను సమీక్షించేందుకు స్టేట్ లెవెల్ క్వాలిటీ అస్యూరెన్స్ కమిటీలను నియమించామని చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో టాపర్లుగా నిలిచిన వారిని ప్రోత్సహించేందుకు ల్యాప్‌టాప్‌లను ఇస్తున్నట్టు తెలిపారు.