తెలంగాణ

అసమర్థ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 6: రాష్ట్రంలో తెరాస అసమర్థ పాలనకు జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమనిని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. తెరాస రెండేళ్ల పాలనపై నిర్వహించిన సదస్సులో ప్రొఫెసర్లు కోదండరామ్, హరగోపాల్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీవ్ సద్భావన యాత్రలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న విహెచ్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తిలోదకాలిస్తూ ప్రజలను మోసం గిస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను విస్మరించిన కెసిఆర్ నైతిక విలువలకు తిలోదకాలిస్తూ, ఫిరాయింపులను ప్రోత్సహించడంపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంతో స్వేచ్ఛను అందించే కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నాయకులు, వన్ మ్యాన్ షోగా చెలామణి అవుతున్న తెరాస పార్టీలో ఎంతమాత్రం ఇమడలేరన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ప్రతి అంశంపై గళాన్ని వినిపించిన కేశవరావు ప్రస్తుతం వౌనం వహించడం తెరాసలో నాయకులకు స్వేచ్ఛ లేదన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో అనేక పదవుల్లో కొనసాగిన నాయకుడు ప్రస్తుతం తెరాసలో చేరి అవినీతిని నిర్మూలిస్తానని, బంగారు తెలంగాణకు పాటుపడతాననడం విడ్డూరంగా ఉందని పరోక్షంగా డిఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ కెఆర్.సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఫక్రుద్దీన్, టి.పిసిసి నాయకులు బి.ప్రసాద్‌రావు, నిరంజన్, గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.