తెలంగాణ

చౌటుప్పల్‌లో ఉపగ్రహ ఆధారిత వర్షపాత నమోదు కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూన్ 6: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో గంటగంటకు వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తేమ శాతం తెలిపే ఉపగ్రహ ఆధారిత నమోదు కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం వాతావరణ శాఖ ఆధ్వర్యంలో 1350 ఉపగ్రహ ఆధారిత వర్షపాత నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా రాష్ట్రంలో ఎనిమిది ఏర్పాటు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్, యాదగిరిగుట్ట, మెదక్ జిల్లా నంగనూర్, మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు, రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్, కరీంనగర్ జిల్లా వేములవాడ, హుస్నాబాద్, హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉపగ్రహ ఆధారిత వర్షపాత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల రూపాయలను కేటాయించింది. చౌటుప్పల్ మండల తహశీల్ కార్యాలయంలో ఉపగ్రహ ఆధారిత వర్షపాత నమోదు కేంద్రం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వర్షపాత నమోదు కేంద్రంకు సంబంధించి అన్ని పరికరాలను అమర్చారు. సౌరశక్తి సహాయంతో ఈ కేంద్రాలు పనిచేస్తాయి.