తెలంగాణ

నా కంటే ఎక్కువ పాల్వాయి తిట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: కాంగ్రెస్‌లో నాయకులు, కార్యకర్తలు పరస్పరం విమర్శించుకోవడం సహజమేనని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. లోగడ తన కంటే ఎక్కువగా పార్టీ ఎంపి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ గుర్తు చేశారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డిని తమ పార్టీ ఎంపి పాల్వాయి గోవర్దన్ రెడ్డి వంద సార్లు తిట్టి ఉంటారని ఆయన తెలిపారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్‌పై కూడా విమర్శలు చేశారని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లో ఇటువంటివి సహజమేనని అన్నారు. కాంగ్రెస్ సముద్రం వంటిదని ఆయన చెప్పారు. లోగడ పార్టీని ఎవరు విమర్శించినా చర్య తీసుకోలేదని ఆయన తెలిపారు. తనపై క్రమశిక్షణా చర్య తీసుకునే అవకాశం లేదని అన్నారు. షోకాజ్ నోటీసుకు వారం రోజుల్లో సమాధానం చెప్పకపోతే చర్య తీసుకుంటామని టి.పిసిసి చేసిన హెచ్చరిక గురించి ప్రశ్నించగా, అసలు తనకు షోకాజ్ నోటీసే రాలేదని ఆయన తెలిపారు.
కృష్ణా బోర్డుపై ఏపి వత్తిడి
ఇదిలావుంటే, కృష్ణా నదీ జలాల బోర్డుపై ఆంధ్రప్రదేశ్ పెత్తనం చెలాయిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టకుండా వత్తిడి తెస్తోందని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సీరియస్‌గా తీసుకోవాలని, కేవలం లేఖ రాసినంత మాత్రాన సరిపోదని ఆయన సోమవారం విలేఖరులతో అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తీరుతో మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని, ఎడారిగా మారుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. దిండి ప్రాజెక్టు సర్వే పూర్తయ్యిందని అన్నారు. కొత్త ప్రాజెక్టులను బోర్డు పరిథిలోకి తీసుకుని రాకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని ఆయన విమర్శించారు.