తెలంగాణ

కోటి ఎకరాల్లో పంటల సాగుకు ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6 : తెలంగాణ రాష్ట్రంలో 100 లక్షల ఎకరాల్లో పంట సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని వ్యవసాయ శాఖ కమిషనర్ జి.డి. ప్రియదర్శిని తెలిపారు. సోమవారం ఇక్కడ ఆమె ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, పంటల సాగుకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను పుస్తక రూపంలో రూపొందించామన్నారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ పుస్తకాన్ని త్వరలో ఆవిష్కరిస్తారని వివరించారు. 2016 ఖరీఫ్ సాగుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని, నైరుతీ రుతుపవనాల వల్ల వచ్చే వర్షాలు ప్రారంభం కాగానే విత్తనాలు వేయడం మొదలవుతుందన్నారు. ప్రభుత్వం పరంగా రైతులకు సాధారణంగా 5.69 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సబ్సిడీపై ఇస్తామని, అయితే ఈ ఖరీఫ్‌లో పత్తిపంట విస్తీర్ణాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల సోయాబీన్, మొక్కజొన్న, కందుల పంటల విస్తీర్ణం పెరుగుతోందన్నారు. అందువల్ల 9.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఒక్క సోయాబీన్ విత్తనానే్న 3,75,000 క్వింటాళ్లు సిద్ధంగా ఉంచామన్నారు. అంటే గత ఏడాదికన్నా ఈ సంవత్సరం దాదాపు రెండులక్షల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను అధికంగా ఇస్తున్నట్టు తెలిపారు. మొత్తం ఆహార పంటల విత్తనాలను ఐదులక్షల ఐదువేల క్వింటాళ్లు సిద్ధంగా ఉంచగా, ఇందులో కేవలం వరిధాన్యమే 2,50,000 క్వింటాళ్లుంటాయన్నారు.