తెలంగాణ

టిఆర్టీసి కార్మిక సంఘాలకు జూలై 13న ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మిక సంఘాలు ఎన్నికలకు సన్నద్ధమయ్యాయి. జూలై 13న ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ఖరారుపై యాజమాన్యంతో చర్చలు జరిపాయి. ఎన్నికల షెడ్యూల్, సమ్మె తదితర అంశాలపై ఆర్టీసి యాజమాన్యంతో కార్మిక శాఖ చర్చలు జరిపింది. దీంతో ఆర్టీసిలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈనెల 13వ తేదీ వరకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇవ్వాలని టిఎస్‌ఆర్టీసి యాజమాన్యానికి కార్మిక శాఖ సహాయ కమిషనర్ గంగాధర్ ఆదేశించారు. ఓటర్ లిస్ట్‌పై ఈనెల 17వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారని, 25న తుది ఓటర్ల జాబితా ప్రకటించి 30న, కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్టు అసిస్టెంట్ కమిషనర్ గంగాధర్ తెలిపారు. వచ్చే నెల 13న ఆర్టీసి కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతాయని, ఈ ఎన్నికల బరిలో 12 కార్మిక సంఘాలు పాల్గొంటాయని గంగాధర్ వివరించారు. పోలింగ్ జూలై 13న ఉదయం గం. 5.00ల నుంచి సాయంత్రం గం. 6.00ల వరకు జరుగుతుందని, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు 18, 19వ తేదీల్లో జరుగుతుందని తెలిపారు. ఇదిలావుంటే, పోలింగ్ తేదీపై పలు యూనియన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. జూలై 26వ, తేదీన పోలింగ్ నిర్వహించాలని మెజార్టీ కార్మిక సంఘాలు ప్రతిపాదించగా, జూలై 13,16వ తేదీల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఆర్టీసి యాజమాన్యం సిద్ధమైంది. కాగా జూలై 19న పోలింగ్ జరపాలని కార్మిక శాఖ నిర్ణయించింది. పోస్టల్ ఓటింగ్ 25,26 తేదీల్లో నిర్వహించాలని, తుది ఫలితాలు ఆగస్టు 6న ప్రకటించేందుకు కార్మిక శాఖ నిశ్చయించింది. అయితే పరస్పర అవగాహనతో ఎన్నికలకు అన్ని కార్మిక సంఘాలతోపాటు, ఆర్టీసి యాజమాన్యం మరోసారి చర్చలు జరుపుకోవాలని కూడా కార్మిక శాఖ అవకాశం ఇచ్చినట్టు కార్మిక సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.