తెలంగాణ

ఈనెలలోనే కల్వకుర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: కల్వకుర్తి ప్రాజెక్టును పనులు ఈనెలలోనే పూర్తి చేసి, ప్రాజెక్టు ద్వారా 1.5లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లోనే మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. కల్వకుర్తి నుంచి 1.5 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ప్రాజెక్టు నుంచి లక్షా 50వేల ఎకరాలు, భీమా ద్వారా 1.40 లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుల పనులపై మంత్రి జిల్లా అధికారులతో చర్చించారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేసినందున పనులు ఊపందుకున్నాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ పనులు ఈనెలలో పూర్తయ్యేట్టు చూడాలని మంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీల్డు చానల్స్‌లను తనిఖీ చేస్తున్నామని, ఆయా కాలువల్లో ఉన్న గడ్డి, రాళ్లు, రప్పలు, ఇతర అడ్డంకులను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నట్టు మహబూబ్‌నగర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌రావు తెలిపారు. ఖరీఫ్‌నాటికి ఆయకట్టు లక్షాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఖరీఫ్‌లో మహబూబ్‌నగర్ జిల్లాలో 4.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి అధికారులు తగిన విధంగా పని చేయాలని నీటిపారుదల శాఖ తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు.
chitram...

కల్వకుర్తి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు (ఫైల్ ఫొటో)