తెలంగాణ

ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన నైజీరియన్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 4: గతకొంతకాలంగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ల ముఠాను కరీంనగర్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నైజీరియన్‌లకు సహకరించిన భారతీయుడుతోసహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్‌కు చెందిన టెడ్డి మిలాన్, కెల్విన్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందిన మహ్మద్ ఆసిమ్‌లను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ ముఠాను మీడియా ఎదుట హాజరుపర్చి వివరాలను వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం...బసంత్‌నగర్‌లోని బిసికాలనీలో నివసిస్తున్న ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వొడ్నాల సాయితేజ (19)కి ఈ ముఠా ఫోన్ చేసి ఈ-మెయిల్ ద్వారా లక్కీ డ్రాలో మీరు రూ.2.60 కోట్లు గెలుచుకున్నారని, రిజర్వ్ బ్యాంకు నుంచి నగదు ట్రాన్స్‌ఫర్ కోసం రూ.15 వేలు డిపాజిట్ చేయాలని చెప్పడంతో సాయితేజ మొదటగా 15 వేలు డిపాజిట్ చేశాడు. మరికొద్ది రోజులకు ఫైనాన్స్ మినిష్టర్ క్లియరెన్స్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వష్టిగేషన్ క్లియరెన్స్, ఐఎంఎఫ్ నుంచి క్లియరెన్స్ రావాలని, దానికోసం మరికొంత నగదు డిపాజిట్ చేయాలని తెలపగా, ఆ ముఠా సూచించిన ఆరు ఎస్‌బిఐ ఖాతాలలో రూ.24 లక్షలు సాయితేజ డిపాజిట్ చేశాడు. మరోసారి నగదు డిపాజిట్ చేయాలని కోరగా, మోసం జరిగిందని భావించి బాధితుడు సాయితేజ ఎస్పీని సంప్రదించగా, బసంత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తూ, అక్కడి పోలీసులను ఎస్పీ ఆదేశించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బసంత్‌నగర్ పోలీసులు క్రైమ్ నెంబర్ 73/2016 అండర్ సెక్షన్ 468, 417, 420 ఐపిసి సెక్షన్ 66డి ఆఫ్ ఐటి యాక్టు 2000 పక్రారం కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసు అధికారులు హరియానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విచారణ చేపట్టగా, మోసాలకు పాల్పడింది ఇద్దరు నైజీరియన్లు, ఒక భారతీయుడని గుర్తించారు. అనంతరం నైజీరియన్లు టెడ్డి మిలాన్, కెల్విన్‌తోపాటు వీరికి సహకరించిన భారతీయుడు ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందిన మహ్మద్ ఆసిమ్‌ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.2.29 లక్షలు, రెండు ల్యాప్‌టాప్‌లు, 9 మొబైల్ ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని ఈ నెల 1, 2 తేదీల్లో ఢిల్లీ సాకేట్ కోర్టులో హాజరుపర్చి, ట్రాన్సిట్ వారంట్‌పై కరీంనగర్‌కు తీసుకువచ్చామని ఎస్పీ తెలిపారు.