తెలంగాణ

ఎమ్మెల్యే ఎలా ఉంటాడో చూపిస్తా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్కనూరు, జూన్ 4: ‘ఎమ్మెల్యే అంటే తెలియని వాడివి... ఎందుకు పెట్టుకున్నావో వాడిని ...నా ముందుకు పిలిపించు.. వాడు ఎంతటివాడు... తక్షణమే వాడిని పనిలో నుండి తొలగించు’ అంటూ ప్రభుత్వ విప్, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీవ్ర స్థాయిలో టోల్‌ప్లాజా నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్‌ప్లాజా ఇన్‌చార్జి అయిన మురళిని ఏ మురళి నీ టోల్‌ప్లాజ్‌లో లోకల్ సిబ్బంది తప్ప నాన్‌లోకల్ సిబ్బంది పనిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, కామారెడ్డి నియోజకవర్గానికి చెందినవారే టోల్‌ప్లాజాలో పనిచేయాలని ఆయన హుకుం జారీ చేశారు. శనివారం భిక్కనూరు సమీపంలో గల టోల్‌ప్లాజా వద్ద గంప గోవర్ధన్ టోల్‌ప్లాజా తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని బాగిర్తిపల్లి ఎంపిటిసి సభ్యుడు తొగరి సుదర్శన్ తాను ఎంపిటిసి సభ్యుడినని కావాలంటే ఎమ్మెల్యేకు చెబుతానని టోల్‌ప్లాజా వద్ద అనగా ఎమ్మెల్యే ఎవరో తెలియదంటూ సిబ్బంది చెప్పడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్లాజా ఉద్యోగి నర్సింహారెడ్డిని తన ముందుకు పిలిపించాలని, ఎమ్మెల్యే అంటే ఏమిటో, ఎమ్మెల్యే పవర్ ఏమిటో చూపిస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టోల్‌ప్లాజా ఇన్‌చార్జి మురళీధర్‌రెడ్డి తప్పు జరిగింది క్షమించాలని, నిన్ననే నర్సింహారెడ్డికి వార్నింగ్ ఇచ్చామని, ఇకముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని వేడుకున్నాడు. అయినప్పటికీ ప్రభుత్వ విప్ వినిపించుకోకపోగా మండల నాయకులతో పాటు నియోజకవర్గ నాయకులు వచ్చి టోల్‌ప్లాజా పనితీరుపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందించారు. ఇటీవలే ఆర్‌డిఓ నగేశ్‌రెడ్డిని టోల్‌ప్లాజా వద్ద ఆపితే స్థానిక తహశీల్దార్ అంజయ్య వెళ్లి టోల్‌ప్లాజా నుండి పంపించారని, అంతకు ముందు జిల్లా కలెక్టర్ యోగితారాణాకు అదే పరిస్థితి తలెత్తిందని పలువురు నాయకులు ఆరోపించారు. టోల్‌ప్లాజా నిర్వాహకులు తీరు మార్చుకోకపోతే తట్టబుట్ట పట్టుకుని ఇక్కడి నుండి వెళ్ల్లిపోవాల్సి వస్తుందని, ఇందల్‌వాయి టోల్‌ప్లాజా వద్ద లేని ఆరోపణలు భిక్కనూరు టోల్‌ప్లాజాపై ఎందుకు వస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లోకల్ చెప్తే ఇందల్‌వాయి వద్ద పంపిస్తున్నారని, కానీ ఇక్కడ లోకల్ అని చెప్పినా కూడా పంపించకపోవడం ఎంత దారుణమన్నారు. ఎమ్మెల్యే స్టిక్కరు ఉన్న కార్లను కూడా పంపించడం లేదని ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే అంటే అంత అలుసా అంటూ మండిపడ్డారు. వెంటనే టోల్‌ప్లాజాలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను రికార్డుల్లో పరిశీలించారు. కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన సిబ్బంది మాత్రమే టోల్‌ప్లాజా వద్ద పనిచేయాలని ఆదేశించారు.