తెలంగాణ

బహుళ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని నిరోధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో బహుళ ఫ్లైవోవర్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని, ఆమోదాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పర్యావరణవేత్త డాక్టర్ కె పురుషోత్తం రెడ్డి శనివారం పిల్‌ను దాఖలు చేశారు. ఈ ఫ్లైవోవర్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వరాదని ఆయన హైకోర్టును అభ్యర్థించారు.
చెట్లను నరకడం, కొత్త పరిశ్రమల విధానం కింద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పర్యావరణ వ్యతిరేక విధానాలను అమలు చేయడం విరుద్ధమని ప్రకటించాలంటూ ఆయన కోర్టును అభ్యర్థించారు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం కింద స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు వల్ల కెబిఆర్ జాతీయ పార్కు, దుర్గం చెరువుతో పాటు పలు పర్యావరణ ప్రదేశాలు దెబ్బతింటాయన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల ట్రాఫిక్, కాలుష్యం పెరుగుతుందన్నారు. గత పదిహేను సంవత్సరాల కాలంలో నగరంలో అనేక రోడ్లను వెడల్పు చేశారని, ఫ్లైవోవర్లను నిర్మించారని, కాని ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించలేదన్నారు. ప్రైవేట్ వాహనాలు రోడ్లను ఆక్రమించుకుంటున్నాయని, భారీ పార్కింగ్ చార్జీలను విధించాలని, ప్రధాన మార్కెట్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని ఆయన కోర్టును కోరారు.