తెలంగాణ

స్కూల్ ఫీజులకు నియంత్రణ మండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణలో స్కూలు ఫీజులపై ఉద్యమం రోజురోజుకూ ఉద్ధృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఇప్పటికే పలు రూపాల్లో ఉద్యమం చేపట్టిన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్‌జిఓలు తాజాగా ఒకే గొడుగు కిందకు వచ్చి న్యాయపోరాటానికి ఇంకో పక్క ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. స్కూళ్లవారీ పాలక మండళ్లను వేసి వారినే ఫీజులు నిర్ధారించుకోమని ప్రభుత్వం చెప్పడం సరికాదని, స్కూలు ఫీజులకు సైతం నియంత్రణా మండలి ఉండాలని హెచ్‌ఎస్‌పిఎ , ఎస్‌ఎఫ్‌ఆర్, స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కోరుతున్నారు. శనివారం నాడు ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద స్కూల్ ఫీజులను నియంత్రించాలని కోరుతూ పోస్టర్‌ను విడుదల చేశారు.
జూన్ 11న భారీ ఎత్తున ధర్నా చేపట్టనున్నట్టు వారు ప్రకటించారు. ఎస్‌ఎఫ్‌ఆర్ జాక్ నేతలు శివ, ప్రకాష్, వెంకట్, కమల్, సీమ, సుబ్బు, విక్రాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్కూలు ఫీజులపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ పోరుకొనసాగుతుందని చెప్పారు. జీవో 1 (01/01/1994) ప్రకారం ఐదు శాతానికి మించి ఆదాయం పొందడానికి వీల్లేదని చాలా స్పష్టంగా ఉందని, ప్రతి ఏడాది వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్టులు ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుందని అయితే దీనిని అడిగేవారు, ప్రశ్నించేవారు కూడా లేరని వారు పేర్కొన్నారు. జీవో 42(30/07/2010) ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేరటీ కమిటీల అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. జీవో 246 ప్రకారం పాఠశాలల నిర్వహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి.
సిబిఎస్‌ఇ చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో ఇద్దరు తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలి, వీరిని సంప్రదించిన తర్వాతనే ఫీజులను నిర్ధారించాల్సి ఉంటుంది. జీవో 91(06/08/2009) ప్రకారం వన్ టైమ్ ఫీజుగా అప్లికేషన్ ఫీజు వంద రూపాయిలు, రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపాయిలు, తిరిగి చెల్లించే వీలుకల్పించే కాషన్ డిపాజిట్ ఫీజు 5వేల రూపాయిలకు మించకుండా తీసుకోవాలని, ఈ జీవోలోని సెక్షన్ 1(సి) ప్రకారం పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారం అమ్మకాలపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలున్నాయని చెప్పారు. కమిషన్ జారీ చేసిన ఆర్‌సి 780( 16/05/2013)లోని సెక్షన్ 8(1) ప్రకారం పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటి, ఒలింపియాడ్, కానె్సప్ట్, ఈ టెక్నో, ఈ శాస్త్ర తరహా అదనపు పేర్లను కలపడానికి వీలు లేదని అయితే ఇవేవీ ఆచరణలో లేవని హెచ్‌ఎస్‌పిఎ ప్రతినిధులు పేర్కొన్నారు.
chitram శనివారం నాడు హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద స్కూల్ ఫీజులను నియంత్రించాలని కోరుతూ పోస్టర్‌ను విడుదల జేస్తున్న జెఎసి నాయకులు