తెలంగాణ

ఐసెట్ టాపర్ గాజుల వరుణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: తెలంగాణ ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ -2016 ఫలితాలను కాకతీయ విశ్వవిద్యాలయం ఇన్ చార్జి వైస్ చాన్సలర్ టి చిరంజీవులు మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఐసెట్ కన్వీనర్ కె ఓం ప్రకాష్, ఉన్నత విద్యామండలి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 19న నిర్వహించిన ఐసెట్ ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేసినట్టు చిరంజీవులు చెప్పారు. మొదటి ర్యాంకు కరీంనగర్ జిల్లాకు చెందిన గాజుల వరుణ్ దక్కించుకోగా, రెండో ర్యాంకు వివేక్ విశ్వనాథన్ అయ్యర్ (మహారాష్ట్ర) దక్కించుకున్నాడు. మూడు, నాలుగు ర్యాంకులు ఆంధ్రాకు చెందిన విద్యార్ధులు రాం ప్రసాద్, ప్రశాంత్ కుమార్ రెడ్డిలు దక్కించుకున్నారు. ఐసెట్‌లో మొత్తం 95.55 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని చిరంజీవులు చెప్పారు.