తెలంగాణ

భక్తజన సంద్రం.. కొండగట్టు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 31: పెద్ద హనుమాన్ జయంత్యుత్సవాల సందర్భంగా మంగళవారం కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు భక్తజన సంద్రంతో పులకించిపోయింది. ఆంజనేయస్వామికి ప్రీతికరమైన రోజున హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగడంతో అంజన్న సన్నిధి భక్తజనంతో కిక్కిరిసిపోయింది. సోమవారం అర్ధరాత్రి నుంచే తమ ఇష్టదైవమైన అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు, హనుమాన్ దీక్షాపరులు పెద్ద సంఖ్యలో కొండగట్టుకు తరలిరాగా, మంగళవారం రాత్రి వరకు కూడా భక్తుల తాకిడి అలాగే కొనసాగింది. కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుమారు లక్ష మంది భక్తులు, హనుమాన్ దీక్షా పరులు ‘పవనసుతుడి’ని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించగా, మండలం, అర్థ మండలం, పదకొండు రోజులు దీక్షలు తీసుకున్న హనుమాన్ దీక్షాపరులు మాల విరమణ చేశారు. కొండగట్టు ఆలయంతోపాటు పరిసరాలు కాషాయవనంలా మారి కొత్త శోభను సంతరించుకుంది. హనుమాన్ చాలీసా పారాయణాలు, దండక పఠనాలు, రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్‌కీ...అంటూ భక్తులు నినదించిన రామ, హనుమన్మామ స్మరణలతో అంజన్న సన్నిధి మార్మోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేసినప్పటికీ కొంతమేర ఇబ్బందులు తప్పలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా కొండగట్టు రహదారుల్లో వన్ వే ఏర్పాటు చేశారు. జగిత్యాల డిఎస్పీ రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో బందోబస్తు చర్యలు కొనసాగాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి అమరేందర్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు

చిత్రం హనుమజ్జయంతి సందర్భంగా మంగళవారం కొండగట్టు భక్తజన సంద్రంతోపులకించింది. సుమారు లక్ష మంది భక్తులు, హనుమాన్ దీక్షా పరులు ‘పవనసుతుడి’ని దర్శించుకున్నట్లు అంచనా.