తెలంగాణ

ఇసుక దిబ్బలు విరిగి పడి ఇద్దరు చిన్నారుల సజీవ సమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, మే 17: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం మడ్‌మడ్‌క గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బతండాలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఆడుకునేందుకు తండా సమీపంలోని మైనంపల్లి వాగులోని ఇసుక గుంతలోకి దిగిన ఇస్లావత్ పవన్ (7), ఇస్లావత్ సిద్దు (7) అనే ఇద్దరు చిన్నారులు ఇసుకదిబ్బలు కూలిపడడంతో సజీవసమాధి అయ్యారు. తండాకు సమీపంలోని వాగులో ఇసుక తవ్వేందుకు వెళ్ళిన లక్ష్మాకు భోజనం ఇచ్చేందుకు వెళ్ళారు. వాగులోకి వెళ్ళే సమయంలో పవన్ తనకు తోడుగా తన సోదరుడు వరస అయిన సిద్దును కూడా తీసుకెళ్ళాడు. వాగులో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించిన అనంతరం ఏర్పడిన పెద్ద గుంతలోకి ఆడుకునేందుకు పవన్, సిద్దు దిగారు. వీరిద్దరూ ఒక్కసారిగా గుంతలోకి దూకడంతో గుంత అంచుల్లో ఉన్న ఇసుక ఒక్కసారిగా కూలిపోయి ఇద్దరు చిన్నారులపై పడింది. దీంతో పవన్, సిద్దు అక్కడికక్కడే సజీవసమాధి అయ్యారు.
ఇద్దరు చిన్నారులు గుంతలోకి దిగడం, ఇసుక కూలిపోవడాన్ని గమనించిన వారు వెంటనే చిన్నారులను రక్షించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. స్థానికులు హుటాహుటిన రోడ్డు పనిచేస్తున్న జెసిబిని తీసుకొచ్చి ఇసుకను తొలగించి పవన్, సిద్దును బయటకు తీశారు. ఇద్దరినీ దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాలను దుబ్బతండాకు తరలించారు. అనుకోని ప్రమాదంలో ఒకేసారి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ఇసుక దిబ్బలు పడి మృతి చెందిన పవన్, సిద్దు

ఐసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
నక్కలగుట్ట, మే 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2016-17 విద్యాసంవత్సరానికి ఎంబిఎ, ఎంసిఎలలో ప్రవేశానికై నిర్వహించే ఐసెట్ 2016 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాష్ మంగళవారం తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా ఈ నెల 19న జరిగే ఐసెట్ పరీక్షకు 127 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షకు 72474 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు, పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుందని వివరించారు. గంట ముందునుండే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు అప్లికేషన్ ఫాంను కూడా వెంట తెచ్చుకోవాలన్నారు. ఈ ఏడాది నుండి బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరుస్తున్నామని, ప్రత్యేకంగా బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లను నియమించామన్నా రు. పరీక్ష అనంతరం విద్యార్థులు ప్రశ్న పత్రాన్ని తీసుకుని వెళ్లవచ్చునని వివరించారు. ఈ సమావేశంలో వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్ ప్రొ. సాయిలు పాల్గొన్నారు.