తెలంగాణ

జగన్ దీక్షపై మండిపడ్డ టిఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: తెలంగాణలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేస్తోన్న దీక్షపై టిఆర్‌ఎస్ భగ్గుమంది. టిఆర్‌ఎస్ అధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా జగన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది. టిఆర్‌ఎస్ అధ్వర్యంలో జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో టిఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, జగన్ దిష్టిబొమ్మల దహనం జరిగింది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటే సహించేది లేదని ఆందోళనకారులు హెచ్చరించారు. తెలంగాణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి తీవ్ర అన్యాయం జరిగిందని, అదే వారసత్వాన్ని ఆయన కుమారుడు జగన్ కొనసాగిస్తున్నారని టిఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు.
ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అధిపత్యం కోసం టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు, అక్కడి ప్రతిపక్ష నాయకుడు జగన్ తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఆనుసరిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. రాజకీయాల కోసం తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. ముఖ్యమంత్రి, మంత్రుల గురించి ఆంధ్రనేతలు నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.
టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మంగళవారం ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ వ్యతిరేకంగా ఆంధ్రనేతల అనుసరిస్తున్న నైజాన్ని ఇప్పటికైనా ఆ పార్టీల్లోని తెలంగాణ నేతలు కళ్లు తెరవాలని హితవు పలికారు.

ఉపాధి హామీ సిబ్బంది సమ్మె విరమణ
వేతనాల పెంపుపై సిఎంతో మాట్లాడతానన్న మంత్రి జూపల్లి

హైదరాబాద్, మే 17 : తెలంగాణ రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమ్మెను విరమించారు. పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వద్ద జరిగిన చర్చల తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి కృష్ణారావు కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. ముఖ్యమంత్రితో చర్చించి వేతనాల హెచ్చింపు, ఇతర సమస్యలను పరిష్కరిస్తానని జూపల్లి హామీ ఇచ్చారు. 2016-17 లో 50 లక్షల మందికి కనీసం 100 రోజులు పనిదినాలను కల్పించాలని నిర్ణయించారు. గత ఏడాది కూలీల వేతనాలకు 1750 కోట్ల రూపాయలు, మెటీరియల్ కంపోనెంట్ కింద 750 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కూర్చునేందుకు వీలుగా గ్రామ పంచాయితీల్లోవౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ వివరాలను ప్రజలకు తెలిపేందుకు ఫీల్డ్‌అసిస్టెంట్లకు మైక్ సెట్ ఇచ్చి, ప్రకటన చేసేలా చూడాలని నిర్ణయించారు.