తెలంగాణ

31న ప్రజాభిప్రాయ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 17: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మించ తలపెట్టిన 4,400 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతుల దిశగా ఈ నెల 31న ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధమైంది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన టివోఆర్ (టర్మ్ ఆఫ్ రిఫరెన్స్) అనుమతులను గతంలోనే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల బృందం అనుమతినిచ్చింది. పిదప జెన్‌కో పర్యావరణ అనుమతులను కోరింది. పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను నిర్వహించాల్సివుంది. ప్రజాభిప్రాయ సేకరణ ఆటంకాలు లేకుండా సాఫీగా పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వం, జెన్‌కో నిర్ణయించుకున్న మేరకు 2018లోగా ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా ముందడుడు పడనుంది. కృష్ణానదికి వెళ్లే తంగపాడు బంధం వాగు నీరు థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో కలుషితమై కృష్ణా, మూసీ జలాలు కాలుష్యం బారిన పడుతాయన్న అభ్యంతరాలు తొలుత కేంద్ర అటవీ, పర్యావరణ నిపుణుల కమిటీ వ్యక్తం చేసింది. చివరకు ప్లాంట్ నిర్మాణంతో ఈ దిశగా ఎలాంటి సమస్యలు రాకుండా జెన్‌కోకు షరతులతో కూడిన టివోఆర్‌ను అనుమతించింది. ఇక ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తయి పర్యావరణ అనుమతులు లభిస్తే యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ పనులు జోరందుకోనున్నాయి. ప్రస్తుతం మట్టి నమూనాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. జెన్‌కో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కోసం అటవీ శాఖ భూములతో కలిపి మొత్తం 5,500 ఎకరాల మేరకు భూసేకరణ ప్రక్రియ చేపట్టారు. 1893 హెక్టార్ల అటవీ శాఖ భూముల బదలాయింపునకు కేంద్ర అనుమతినివ్వడం జరిగిపోగా రైతుల భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. భూములు కోల్పోతున్న వారికి ఎకరాకు 6 లక్షల పైచిలుకు, ఇల్లు వాకిలి కోల్పోతున్న వారికి 10 లక్షల మేరకు పరిహారం చెల్లించడంతో పాటు ఐఏవై ఇళ్లు, తరలింపు ఖర్చులు తదితర నిర్వాసిత ప్యాకేజీలన్నింటిని అమలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 31న జరుపతలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ సాఫీగా సాగి పర్యావరణ అనుమతులన్ని లభించిన పక్షంలో పవర్ ప్లాంట్ పనుల స్పీడ్ పెంచేందుకు జెన్‌కో సన్నద్ధమవుతోంది.