తెలంగాణ

క్రికెట్ కోచ్ లైంగిక వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, మే 17: జిహెచ్‌ఎంసి చందానగర్ స్పోర్ట్స్ స్టేడియంలో ఓ క్రికెట్ కోచ్ లైంగిక వేధింపులు వెలుగుచూశాయి. యువ క్రికెటర్లను బెదిరించి అసహజ సెక్స్‌కు పాల్పడుతూ దొరికిపోయాడు. కోచ్ వేధింపులను పోలీసుల దృష్టికి బాధిత క్రీడాకారులు, తల్లిదండ్రులు తీసుకెళ్లడంతో బండారం బయటపడింది. చందానగర్‌లోని పిజెఆర్ స్టేడియంలో బార్కాస్‌కు చెందిన సలామ్‌బిన్ (32) నాలుగేళ్లుగా క్రికెట్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అండర్-16 జట్టులోని క్రీడాకారులను తన ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి అసహజమైన రీతిలో లైంగిక చర్యకు పాల్పడేవాడు. ఎవరైనా బయటపెడితే క్రికెట్ ఆటకు పనికి రాకుండా చేస్తానని బెదిరించేవాడు. అధికారులు వంత పాడటంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. కొందరు విద్యార్థులు భయపడి కోచింగ్ మానేశారు. పరువు పోతుందని తల్లిదండ్రులు ఎవరికీ చెప్పలేదు. సుమారు 15మంది యువ క్రీడాకారులతో కోచ్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. కోచింగ్‌కు వెళ్లనని 16ఏళ్ల క్రికెటర్ తన ఇంట్లో చెప్పడంతో మంగళవారం అతని తండ్రి వచ్చి ఆరా తీశాడు. కోచ్‌ను నిలదీయడంతో లైంగిక బండారం బయటపడింది. బయటకు పొక్కకుండా కొంతమంది కోచ్‌లు, సంబంధిత అధికారులు విఫలయత్నం చేశారు. చందానగర్ ఇన్‌స్పెక్టర్ తిరుపతిరావు, ఎస్‌ఐలు వెళ్లి విచారించారు. కోచ్‌కు పెద్ద గదిని కేటాయించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
క్రికెట్ కోచ్ అరెస్టు
యువ క్రికెటర్లతో అసహజ లైంగికదాడికి పాల్పడిన కోచ్ సలామ్‌బిన్‌ను అరెస్టు చేశామని ఇన్‌స్పెక్టర్ తిరుపతిరావు తెలిపారు. ఐదారుగురిపై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తేలిందన్నారు. ఐపిసి 377, 511 సెక్షన్లు, పోస్కో యాక్ట్ సెక్షన్ 8 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.