తెలంగాణ

వేడుకలు అదరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: రాష్ట్ర పండగలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుందామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అభిలషించారు. జూన్ 2న హైదరాబాద్ సహా రాష్టవ్య్రాప్తంగా అవతరణ దినత్సవం అదిరిపోవాలని పిలుపునిచ్చారు. దీనికోసం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీతో సిఎం కెసిఆర్ మంగళవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జరిగే వేడుకల్లో గవర్నర్, సిఎం, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా సభ నిర్వహిస్తారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో జిల్లా మంత్రి, కలెక్టర్, ఇతర ప్రముఖులు పాల్గొంటారన్నారు. అమరవీరుల కుటుంబీకులను జిల్లాల్లో ఘనంగా సన్మానించాలని, వారికి విఐపి హోదా కల్పించాలన్నారు. 1969 ఉద్యమంలో పాల్గొన్న వారిని సైతం ఆహ్వానించి గౌరవించాలని కోరారు. జీవిత సాఫల్య పురస్కారంతో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 50మందికి రాష్టస్థ్రాయిలో, అదేవిధంగా 25 మందికి జిల్లా కేంద్రాల్లో అవార్డులు అందించాలని నిర్ణయించారు. హైదరాబాద్ సహా ఇతర నగరాలు, జిల్లా కేంద్రాల్లో వీధులు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలను అలంకరించాలని ఆదేశించారు. పరిశ్రమలు, ఆస్పత్రులు, హోటళ్లు, మాల్స్, థియేటర్లలో పండుగ వాతావరణం కనిపించాలన్నారు. ఎయిర్‌పోర్టు, హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లను అలంకరించి బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని, అనాథ శరణాలయాలు, అంథ పాఠశాలల్లో పండ్లు, స్వీట్లు పంచాలని, మాంసాహారం అందించాలని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో తెలంగాణ రాష్ట్భ్రావృద్ధి, ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలన్నారు. జిల్లా, డివిజన్ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రాష్ట్రావిర్భావం ఇతివృత్తంగా తెలుగు, ఉర్దూ భాషల్లో కవి సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని అమరవీరుల స్థూపాలు, తెలంగాణ తల్లి విగ్రహాలను అలంకరించాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని, ట్యాంక్‌బండ్‌పై జూన్ 2న రాత్రి పెద్దఎత్తున బాణసంచా పేల్చి సంబురాలు నిర్వహించాలని నిర్ణయించారు. నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రావతరణ ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీతో సిఎం బుధవారం సమావేశమవుతారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఉత్సవ నిర్వహణ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ నాయిని నర్సింహ్మారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం... రాష్ట్రావతరణోత్సవ ఏర్పాట్లపై ఉత్సవ కమిటీతో సమీక్ష జరుపుతున్న సిఎం కెసిఆర్