తెలంగాణ

ముంపు బెంగతో వృద్ధుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, మే 16: మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌లో గ్రామం ముంపునకు గురవుతుందనే బెంగతో ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా తొగుట మండలం వేములగాట్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొల్లపల్లి రామయ్య (70)కు రెండెకరాల భూమి ఉంది. ఆయన ఇద్దరు కుమారులు పోచయ్య, సత్తయ్య బతుకుతెరువుకోసం ముంబై వలసవెళ్లారు. రామయ్య ఆయన భార్య మల్లవ్వతో గ్రామంలోనే ఉండి కులవృత్తి అయిన చాకలి పనిచేసుకుంటూ, పింఛన్ డబ్బులతో కాలం వెల్లదీస్తున్నాడు. కాగా, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌లో గ్రామం ముంపునకు గురవుతుందని గత వారం రోజులుగా ఆందోళనకు గురై రామయ్య అన్నం సరిగా తినకుండా మన పరిస్థితి ఎట్లా అని బాధపడేవాడు. ఈ క్రమంలోనే ఏటిగడ్డ కిష్టాపూర్‌లో గత మూడు రోజులుగా జరుగుతున్న గొడవలు, ఆందోళనలు రామయ్యను మనోవేదనకు గురిచేశాయి. గ్రామం ముంపునకు గురైతే తాము ఎక్కడికి వెళ్లి బతకాలనే బెంగ రామయ్యను తీవ్ర అస్వస్థతకు గురిచేసింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందాడు. ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం వల్లే రామయ్య గుండెపోటుకు గురై మృతిచెందాడని, నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకుని, గ్రామస్థులకు నెలకొన్న భయాందోళనలను నివృత్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.