తెలంగాణ

రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సాంస్కృతిక కార్యక్రమాలను, వేడుకలను భారీ ఎత్తున, ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. రాష్ట్రావతరణ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాల్లో కన్నుల పండువగా వేడుకలు జరగాలన్నారు. జూన్ 2న ఉదయం తొలుత అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాన వేడుకలు జరుగుతాయన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం ఒక్కో జిల్లాకు 30 లక్షల రూపాయలు కేటాయించామని తెలిపారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలలో అవార్డులు ఇస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో కవిసమ్మేళనాలు కూడా నిర్వహించాలని ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా 1200 మంది వృద్ధకళాకారులకు పింఛను ఇవ్వాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించిన దరఖాస్తులను సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌కు పంపించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల ప్రచారానికి కళాకారుల సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.