Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి తర్వాత పుంఖాను పుంఖాలుగా వస్తున్న సినిమాలు సరైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈవారం కూడా దాదాపు 9చిత్రాలు విడుదలైనట్టు రికార్డులు చెబుతున్నాయి. అందులో నారా రోహిత్ తుంటరి, ఆర్‌పి పట్నాయక్ దర్శకత్వంలో తులసీదళం, ఓ స్ర్తి రేపురా, ఓదార్పు యాత్ర, శ్రీహరి నటించిన నేను మా కాలేజ్‌తోపాటుగా శింబు నటించిన మన్మధన్ ఫర్ సేల్, చిక్కడు దొరకడు, బుల్లెట్ రాణి లాంటి డబ్బింగ్ చిత్రాలూ విడుదలయ్యాయి. చిత్రాలన్నీ ప్రేక్షకుడి నిరాదరణకు గురయ్యాయి. తుంటరి తమిళం నుంచి తీసుకున్న కథ అయినా సరైన రీతిలో సాగకపోవడంతో, రాంగ్ కాస్టింగ్‌తో విడుదలై ప్లాప్ టాక్ ఎదుర్కొంటోంది. తులసీదళం, ఓ స్ర్తి రేపురా చిత్రాలు హారర్ కరవై ఆకట్టుకోలేకపోయాయి. మన్మధన్ ఫర్ సేల్, నేను మా కాలేజ్, ఓదార్పు యాత్ర, చిక్కడు దొరకడు, బుల్లెట్‌రాణి లాంటి చిత్రాల అడ్రస్‌లే దొరకడం లేదు.