Others

ట్రేడ్‌టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత వారం విడుదలైన ఎక్కడి సినిమాలు అక్కడే గప్‌చుప్. ఎటూ వారం రోజులకన్నా ఎక్కువ ఆడవన్న ధైర్యంతోనే విడుదల చేశారు. వారం ధైర్యానికి సినిమాలూ సలాంకొట్టాయి. ఇక ఈవారం దశరథ్ దర్శకత్వంలో శౌర్య, నాగశౌర్య హీరోగా నందినిరెడ్డి దర్శకత్వంలో కళ్యాణ వైభోగమే, జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గుంటూర్ టాకీస్‌తోపాటుగా తమిళంనుండి అనువాదమైన శివగంగ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు సినిమాల్లో శౌర్య మోస్తరు టాక్ తెచ్చుకుంటే, రష్మీ, శ్రద్ధాదాస్ అందాలే ఆదుకుంటాయనుకున్న గుంటూర్ టాకీస్‌కు ప్రేక్షకులు కరువయ్యారు. శివగంగ థియేటర్లు తక్కువ కావడంతో ఎక్కడ ఆడుతుందో తెలియని పరిస్థితి. ఈవారం మంచి వౌత్‌టాక్ తెచ్చుకున్న చిత్రం కళ్యాణవైభోగమే. రొటీన్ పాయింట్‌నే వైవిధ్యంగా చూపడంతో ఆడియన్స్ హడావుడి కనిపిస్తోంది.