Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని సినిమాలొచ్చినా ప్రేక్షకుడి మనసుకు నచ్చే సినిమాలు మాత్రం ఈ రెండు మూడు వారాల్లో అసలు రాలేదు. ఈవారం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కమల్‌హసన్ ‘చీకటి రాజ్యం’, రాజ్‌తరుణ్ కథానాయకుడిగా ‘కుమారి 21ఎఫ్’, అందరూ నూతన తారాగణంతో రూపొందించిన ‘చిరుగొడవలు’, ధన్‌రాజ్ ప్రధాన పాత్రలో ‘ఒక్కడితో మొదలైంది’ చిత్రంతోపాటుగా, ‘మోహిని ది హీరోయిన్’, ‘మరియన్’ చిత్రాలు విడుదలయ్యాయి. చీకటి రాజ్యం యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా థియేటర్లవద్ద ప్రేక్షకులు కనపడకపోవటానికి కారణం తెలియడంలేదు. చిరుగొడవలు చిత్రం ఒక్క మల్టీప్లెక్స్ థియేటర్లకు మాత్రమే పరిమితమవ్వడంతో ఎలాంటి ఫలితం లేదు. ‘కుమారి 21ఎఫ్’ ఒక్కటే యావరేజ్ టాక్‌తో కలెక్షన్లను రాబడుతోంది. ‘ఒక్కడితో మొదలైంది’ చిత్రం కూడా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. ఇక మరియన్, మోహని లాంటి చిత్రాల గురించి చెప్పుకునే అవసరమే లేదు.